- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్ ను ఆట పట్టించడానికి రకరకాల ప్లాన్లు సిద్ధం చేస్తుంటారు చాలామంది. ‘అరేయ్.. నీ తల మీద ఏదో పడిందిరా’ అని ఫ్రెండంటాడు. తీరా అతడు చూస్తే అక్కడ ఏమీ ఉండదు. దీంతో ఏప్రిల్ ఫూల్ అంటూ పకపక నవ్వుతుంటాడు ఆ ఫ్రెండ్.
ఇక ‘నీ కోసం నెక్లెస్ తెచ్చాను.. చూడు ఎలా ఉందో’ అని ఓ బాక్స్ ను భార్య చేతికిస్తాడు ఓ భర్త. చివరికి చూసేసరికి ఆ బాక్స్ ఖాళీగా ఉంటుంది. దీంతో భార్య కోపంగా చూస్తుంటే.. ఏప్రిల్ ఫూల్ అని భార్యను గట్టిగా హత్తుకుంటాడు ఆ భర్త.
ఇక ఎగ్జామ్ పేపర్లు ఇస్తూ.. ‘రమేశ్.. 100 మార్క్స్ ’ అని అనౌన్స్ చేస్తాడు ఓ మ్యాథ్స్ టీచర్. దీంతో పాస్ మార్కులు తెచ్చుకోవడానికే నానా తంటాలు పడే ఆ విద్యార్థి.. తనకెలా 100 మార్క్స్ వచ్చాయబ్బా అని తల గోక్కుంటాడు. ఇంతలోనే ఆ టీచర్ ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఆ విద్యార్థిని ఆట పట్టిస్తాడు.
ఇక ఎప్పటి నుంచో తను ప్రేమిస్తున్న అమ్మాయికి మనసులోని మాట చెప్పాలని ఎదురు చూస్తున్న ఓ లవర్ ఈ ఏప్రిల్ ఫూల్ డే ను కరెక్ట్ గా వాడుకుంటాడు. లవర్ వద్దకు వెళ్లి ‘ ఐ లవ్ యూ’ అంటాడు. ఒకవేళ ఆ అమ్మాయి ‘ఐ టూ’ అందా ఓకే.. లేదంటే ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ అక్కడి నుంచి చిన్నగా జారుకుంటాడు.
ఇలా ఒక్కొక్కరూ ఒక్కోరకంగా తమ ఫ్రెండ్స్ ను , ఫ్యామిలీ మెంబర్స్ ను, లవర్స్ ను, కొలీగ్స్ ను ఈ ఏప్రిల్ 1న ఫూల్స్ చేస్తుంటారు. ఎంత ఫూల్ కావొద్దనుకున్నా ఏదో రకంగా మనల్ని ఫూల్స్ చేస్తుంటారు అవతలివాళ్లు. ఇక ఈ రోజున ఫూల్ అయినా.. ఫూల్ చేసినా ఎంజాయ్ చేయడం మాత్రం కామన్. అసలు ఈ ఏప్రిల్ ఫూల్ డే ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఎలా మొదలైందంటే.. ?
ఏప్రిల్ ఫూల్ డే కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయానికి చాలా ఈ డేను మొదటిసారిగా యునైటెడ్ కింగ్ డమ్ లోని జాన్ ఆబెరీ ప్రారంభించాడని చెబుతుంటారు. 1686, ఏప్రిల్ 1న ‘లండన్ క్లాక్ టవర్ దగ్గర సింహం చనిపోయి ఉంద’ని జాన్ ఆబెరీ కొన్ని పుకార్లు చేశాడు. ఆయన మాటలు నమ్మిన జనం అక్కడికి గుంపులు గుంపులుగా తరలివచ్చారు. అయితే క్లాక్ టవర్ వద్ద సింహం చనిపోయినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారంతా తిరిగి వెళ్లిపోతారు. ఇదే విషయం మరునాటి పేపర్లలో పతాకశీర్షికలతో వచ్చింది. దీంతో అసలు విషయం అక్కడి ప్రజలకు తెలిసింది. జాన్ ఆబెరీనే ఈ పుకారు లేపాడని, అందరినీ ఫూల్స్ చేశాడని పేపర్లలో కథనాలు వచ్చాయి. ఇక జాన్ ఆబెరీని నమ్మిన వాళ్లంతా ఫూల్ అయ్యారని వార్తా పత్రికలు రాశాయి. ఇక అక్కడి నుంచే ఏప్రిల్ ఫూల్ చేయడం మొదలైందని ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది.
ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం..
ఇక ఏప్రిల్ ఫూల్ పుట్టుకకు మరో కథ ప్రచారంలో ఉంది. 1582లో ఫ్రాన్స్ లో అప్పటి వరకు అమలులో ఉన్న జూలియన్ క్యాలెండర్ స్థానంలోకి గ్రెగొరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు అప్పటి పోప్ గ్రెగొరీ. ఇక ఈ కొత్త క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం జనవరి నెలతో మొదలవుతుంది. ప్రస్తుతం మనం దీనినే ఫాలో అవుతున్నాం. అయితే ఫ్రాన్స్ లోని కొంత మంది ప్రజలు మాత్రం చాలా కాలం పాటు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరం జరుపుకునేవారు. అలా జరుపుకునేవాళ్లందరినీ తమ తోటి వాళ్లు ఏప్రిల్ ఫూల్ అంటూ ఆటపట్టించారు. దీంతో ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్ మొదలైందని చెబుతుంటారు. కాగా ఏప్రిల్ ఫూల్ డేను ఆల్ ఫూల్స్ డేగా కూడా పిలుస్తారు. ఇక ఏప్రిల్ ఫూల్ డేను ఇతరులను కించపరచడానికి కాకుండా సరదాగా గడపడానికి వాడుకోవాలని, అప్పుడు నిజమైన ఎంజాయ్ మెంట్ లభిస్తుందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: ఇంట్రెస్టింగ్ న్యూస్.. అక్కడ సూర్యుడు గాల్లో తేలుతాడు!