బ్లేడు అంచులపై నడిచినా గాయపడని ఒకే ఒక్క జీవి.. ఏదంటే?

by Javid Pasha |
బ్లేడు అంచులపై నడిచినా గాయపడని ఒకే ఒక్క జీవి.. ఏదంటే?
X

దిశ, ఫీచర్స్ : బ్లేడు ఎంత పదునుగా ఉంటుందో తెలిసిందే. కేర్ ఫుల్‌గా వాడకపోతే కోసుకుపోయి రక్తం వస్తుంది. ఇక బయటి ప్రదేశాల్లో ఎక్కడైనా బ్లేడ్ పడిపోయి ఉన్నప్పుడు పురుగులు, ఇతర చిన్న చిన్న కీటకాలు దాని అంచులపై నుంచి పాకుతూ వెళ్తే వెంటనే గాయపడి చనిపోయే ప్రమాదం ఉంది. కానీ అలాంటి రిస్కులేవీలేని జీవి కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? పైగా అది బ్లేడు అంచులపై నుంచి నడిచినా చనిపోదు. ఆ జీవి మరేదో కాదు నత్త. వాస్తవానికి నత్తలు శరీరంలో శ్లేష్మం వంటి మందపాటి పొరను స్రవిస్తాయి. పైగా దీనికి నొప్పి కలగదు. పదునైన అంచు వెంబడి వెళ్తున్నప్పుడు ఈ పొర స్పాంజ్‌లా పనిచేస్తూ నత్తల పాదాలను రక్షిస్తుంది. వాటి శరీర నిర్మాణంలో ఉన్న ఈ ప్రత్యేకతలవల్ల బ్లేడు అంచులపై పాకుతున్నప్పుడు కూడా నత్తలు ఏమాత్రం గాయపడవు.

Advertisement

Next Story

Most Viewed