సమాజానికేంటి ఉపయోగం?.. తమ ఉద్యోగాలను ‘అర్థం లేనివి’గా భావిస్తున్న 32 శాతం మంది

by samatah |
సమాజానికేంటి ఉపయోగం?.. తమ ఉద్యోగాలను ‘అర్థం లేనివి’గా భావిస్తున్న 32 శాతం మంది
X

దిశ, ఫీచర్స్ : ‘నా వల్ల, నేను చేస్తున్న జాబ్‌వల్ల ఈ సమాజానికేంటి ఉపయోగం?’ అని మీకెప్పుడైనా అనిపించిందా? కానీ ప్రపంచ వ్యాప్తంగా 32 శాతం మంది ఇలా భావిస్తున్నారని, ఏదో సందర్భంలో తమ క్లోజర్స్‌తో చెప్తుంటారని యూనివర్సిటీ ఆఫ్ జూరిచ్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కొన్ని రంగాలలో ఇటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ వారి ఎదుగుదలను అడ్డుకుంటున్నట్లు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్, సేల్స్ అండ్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్, వర్కర్స్ తమ ప్రొఫెషన్ కారణంగా సొసైటీకి ప్రయోజనం లేదని నమ్ముతున్నారట. యునైటెడ్ స్టేట్స్, జపాన్, స్పానిష్ వంటి దేశాల్లోనా ఆయా రంగాలకు చెందిన ఎంప్లాయీస్‌లోనూ ఈ ధోరణి పెరుగుతున్నట్లు అమెరికన్ ఆంత్రోపాలజిస్ట్ డేవిడ్ గ్రేబెర్ డెవలప్ చేసిన ‘బీఎస్ జాబ్స్ థియరీ’ నివేదిక పేర్కొన్నది.

వర్కర్స్ తమ వృత్తి జీవితాన్ని ఏ విధంగా ఫీలవుతున్నారో తెలుసుకునే ఉద్దేశంతో పరిశోధకులు యూఎస్‌ కేంద్రంగా 21 రంగాలకు చెందిన 1,811 మందికి సంబంధించిన సర్వే డేటాను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా చేస్తున్న పని లేదా ఉద్యోగం, సొసైటీ అండ్ కమ్యూనిటీపై ఎటువంటి ఇంపాక్ట్ చూపుతుందని ఎంప్లాయీస్ ఫీలవుతున్నారో పరిశీలించారు. 19 శాతం మంది తాము చేస్తున్న జాబ్‌వల్ల తమతోపాటు, ఏదో ఒక రూపంలో సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు కనుగొన్నారు. ఇక 32 శాతం మంది మాత్రం తాము చేస్తున్న ఉద్యోగాలను రొటీన్‌గా భావిస్తున్నారట. పైగా వాటిలో కూరుకుపోవడంవల్ల సమాజానికి ఎటువంటి సేవ చేయడానికి కుదరదని, తాము చేస్తున్న జాబ్స్ వల్ల సొసైటీ ఎటువంటి ప్రయోజనం లేదని ఫీలవుతున్నట్లు వెల్లడించారు. కొందరు వ్యక్తులు వర్క్ లేదా వృత్తిపరమైన స్ట్రెస్, పనిలో అంతర్లీన కారణాలు, అడ్మినిస్ట్రేటివ్ కంప్లైట్స్, ఒకే విధమైన దినచర్య, స్వయంప్రతిపత్తి లేకపోవడం, పూర్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలవల్ల తమ ఉద్యోగాలను అర్థం లేనివిగా పీలవుతున్నట్లు పరిశోధకుడు, సోషియాలజిస్ట్ సైమన్ వాలో రిపోర్టు పేర్కొన్నది. బిజినెస్, ఫైనాన్స్ అండ్ సేల్స్‌ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులు ఇతర రంగాలతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా తమ ప్రొఫెషన్ సామాజికంగా పనికిరాదని భావిస్తున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ మేనేజర్స్ కూడా ఇలాగే ఫీలవుతున్నారని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed