- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Womens: ఫ్లవర్ బొకేలే కాదు.. ఆధునిక మహిళ సమానత్వాన్నీ కోరుకుంటోంది!
దిశ, ఫీచర్స్: సమాజంలో మహిళలకున్న ప్రాధాన్యత గొప్పదని, మంచితనంలో, మానవత్వంలో, దయాగుణంలో వారికి సాటిలేదని అందరూ అంగీకరిస్తారు. శ్రమైక్య జీవన సౌందర్య ప్రతీకలని కూడా చెప్తుంటారు. ఉమెన్స్ డే వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారు పురుషుల నుంచి ఫ్లవర్ బొకేలు స్వీకరిస్తారు కానీ, అదే సందర్భంలో వారు సమాజం, సమానత్వం గురించి కూడా ఆలోచిస్తారు. కానీ పురుషులే మహిళల విషయంలో, వారిని అర్థం చేసుకోవడంలో పురుషాధిక్యత సమాజమే కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందని ప్రొఫెసర్ సరయూ మెహతా అంటున్నారు. రేపటి మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ, పురుష సమానత్వం వర్ధిల్లే ఆలోచనలు చేయాలని సూచిస్తున్నారు.
స్వతంత్ర ఆలోచనతో ముందుకు
స్త్రీలు తరచుగా కొన్ని వాస్తవ అంచనాలను కలిగి ఉంటున్నప్పటికీ పితృస్వామ్య భావజాలం కారణంగా పురుషులు మాత్రం వాటిని కష్టంగా భావిస్తుంటారు. లేదా సంప్రదాయాలకు భిన్నమైనదంటూ కొట్టిపారేస్తుంటారు. సమానత్వం, స్త్రీవాదం వంటి ‘ఫాన్సీ’ ఆలోచనలతో ఉండటాన్ని చాలామంది పురుషులు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితులు కళ్లకు కడుతుంటాయి. అయితే ‘‘మహిళలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే భావజాలాన్ని అత్యధిక మంది పురుషులు కలిగి ఉంటారు. కానీ అది కరెక్టా.. కాదా, నేటి మహిళ ఏం కోరుకుంటోందని ఆలోచించేవారు ఎందరు? స్వతంత్ర ఆలోచనతో జీవించాలని కోరుకుంటున్న మహిళలు కూడా పితృస్వామ్య భావజాలాన్ని వీడితే తప్పేంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు స్త్రీ వాదులు. ఆధునిక మహిళ కోరుకునేది ఒక్కరోజు ఫ్లవర్ బొకేలు, శుభాకాంక్షలు మాత్రమే కాదు ఆత్మగౌరవం కూడా అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. స్వతంత్ర ఆలోచనలు, భావజాలాలు ఆమెకూ ఉంటాయి. పురుషులు దానిని అంగీకరించకున్నా, కించ పరిచినా ఆధునిక మహిళ ప్రత్యామ్నాయం ఆలోచించగలదు కానీ, అవమానాలను భరించే పరిస్థితులు లేవని కూడా ఫెమినిస్టులు స్పష్టం చేస్తున్నారు.
స్త్రీలే అడ్జస్ట్ అవ్వాలా?
ఇది కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ కావచ్చు. ఎందుకంటే పురుషులు స్త్రీలకోసం, వారి మేలుకోసం ఏ కొద్ది సమయం కేటాయించనప్పుడు వారు తమను గౌరవిస్తున్నట్లు ఎలా అనుకోగలమనేది ఫెమినిస్టుల ప్రశ్న. పురుషుల ప్రతీ యాక్టివిటీలోనూ మహిళ సపోర్టుగా నిలుస్తోంది. వారిపట్ల అంతగా శ్రద్ధ చూపినప్పుడు కనీసం మహిళలకోసం వారు ఏం చేస్తున్నారో ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తమ ఇంట్లోని మహిళలకు కనీసం ఫోన్ కాల్ చేయడాన్ని కూడా విస్మరిస్తున్న పురుషులను మనం చూస్తుంటాం. ఇటువంటి విషయాల్లో మహిళలు రియలైజ్ అవ్వగలరని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ‘‘మహిళలు ఆత్మ గౌరవాన్ని, సమాజంలో విలువలను, గుర్తింపును పొందాలని కోరుకుంటారు. ఆధునిక మహిళ కలిసి మెలిసి ఉండటంలో హెల్తీ అండ్ బ్యాలెన్సుడ్ రిలేషన్ షిప్ మాత్రమే కోరుకుంటోంది. ఒకవేళ పురుషులు అలాంటి ‘అవాస్తవిక’ ఆలోచనలతో ఏకీభవించనట్లయితే, మహిళలకు తగినంత సమయం, విలువ ఇవ్వడానికి వారికి మరో మంచి మార్గం కూడా ఉంది. అదేంటంటే వారి జీవితం నుంచి బయటికు వెళ్లడం. దీంతో ఆమె తన జీవితాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా సంతోషకరంగా, ఆరోగ్య కరంగా మార్చుకోగలదు’’ అంటున్నారు స్త్రీ వాదులు, సామాజిక వేత్తలు. మహిళా దినోత్సవం కూడా రాబోతోంది. మహిళలు ఏం కోరుకుంటున్నారనే చర్చకంటే వారిని గౌరవించడానికి తగిన మార్గం ఎంచుకోండని సూచిస్తున్నారు. మహిళలు మహిళా దినోత్సవం రోజు మహా అయితే ఫ్లవర్ బొకేలు అందుకుంటారేమో కానీ అంతకు మించి వారు మిగతా విషయాలు అడగడానికి ఇష్టపడరు. ‘సరైన సమయంలో గుర్తింపు పొందడం, ప్రశంసలందుకోవడం, ఫ్లవర్ బొకేలను అందుకోవడం ఏ స్త్రీనైనా సంతోష పరచగలదు. మహిళా దినోత్సవం వంటి అరుదైన సందర్భాలు కూడా వారిని గౌరవించే సరైన వేదికలు’ అంటున్నారు ముంబైకి చెందిన అలియాభట్.
నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు
మహిళలు చక్కగా దుస్తులు ధరించి, అందంగా ముస్తాబై బయటకు వెళ్లడం కూడా కొందరు పురుషులకు నచ్చదు. వారు ఇతర పురుషుల దృష్టిని ఆకర్షించడానికి అలా చేస్తున్నారనే నిందలు వేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. కానీ మహిళలు ఇలాంటివి సహించవద్దని సామాజిక వేత్తలు, స్త్రీ వాదులు చెప్తున్నారు. మహిళలు దుస్తులు ధరించడాన్ని, అందంగా ముస్తాబవడాన్ని ఇష్టపడతారు. ఇదే విషయాన్ని మహిళలు స్పష్టం చేయాలి. అయితే స్త్రీలందరూ కోరుకునేది వారు ధరించే దుస్తులు పురుషుల ద్వారా గౌరవించబడాలనో, ఆకర్షించబడాలనో కాదు, కానీ పితృస్వామ్య భావజాలానికి కట్టబానిసలు చేసేందుకు మహిళలపై అటువంటి నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ స్త్రీలు వాటిని బద్దలు కొట్ట గలగాలి.
‘నో’ అంటే ‘యెస్’ అని కాదు
ఏదైనా విషయంలో ‘నో’ అంటే కాదు, వద్దు అంటున్నారని అర్థం. ఎస్ అంటే అవునని అర్థం అనేది అందరికీ తెలిసిందే. తమకు అసౌకర్యమైన విషయాల్లో నో చెప్పడం అనేది మహిళలకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఫెమినిస్టులు అంటున్నారు. సమాజం కూడా నో అంటే కాదని, ఆమోదయోగ్యం కానిదని మాత్రమే అర్థం చేసుకుంటుంది. కానీ తమాషా ఏమిటంటే పురుషులు మాత్రమే దానిని రివర్సుగా అర్థం చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. “లడకీ హీ నా మే హాన్ హోతీ హై” (Ladki hi na mein haan hoti hai) అమ్మాయి కాదన్నదంటే అవుననే అర్థం అనే కోణంలో పురుషులు ఆ పదాన్ని ఆపాదించేస్తుంటారు. స్త్రీలు నో చెప్తే ‘కావాలి’ అని మీనింగ్‌తో ఎందుకు గ్రహిస్తారు? ఇది తప్పు కదా. బార్‌లో, మీటింగ్‌లలో, ప్రయివేటు చర్చల్లో, బెడ్ టైంలో ఎక్కడైనా ఎటువంటి సందర్భంలోనైనా మహిళల్ని పురుషులు అర్థం చేసుకోవాలి. వారు నో అంటే కాదనే అర్థం చేసుకోవాలి తప్ప, కాదనడాన్ని అవుననే మీనింగ్‌లో అర్థం చేసుకుంటే అది మగవారి దుర్బుద్ది, లేదా వారి వ్యక్తిగత సమస్యగానే అర్థం చేసుకోవాలి కానీ, స్ర్తీల విషయంలో తప్పుగా చిత్రీకరించడాన్ని స్త్రీలు ఎప్పటికీ అంగీకరించరు.
ప్రశాంతతే మొదటి ప్రయారిటీ
ఈరోజుల్లో మహిళలకు కావాల్సిన మొదటి ప్రాధాన్యతలో మానసిక ప్రశాంతత అతి ముఖ్యమైందని మహిళా నిపుణులు చెప్తున్నారు. ‘‘ఆధునిక మహిళలు, స్త్రీవాదులు హింసను, అవమానాలను సైలెంట్‌గా భరించడానికి సిద్ధంగా లేరు. పురుషుల ద్వారా హింసను ఎదుర్కొంటూ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేరు. వారు తర తరాలుగా వస్తున్న అణచి వేతను, ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించడం ప్రారంభించారు. పురుషులు తమతో వ్యవహరించాలని వారు కోరుకుంటున్నారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగించే పురుషాధిక్యతపై, అహంభావంపై పోరాడటానికి ఆధునిక మహిళ సిద్ధంగా ఉంది’’ అంటున్నారు ఫెమినిస్టులు.
ఇవి కూడా చదవండి : హిందూ దేవాలయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వివాహం