- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50,000 బెలూన్లను ప్రేమిస్తున్న వ్యక్తి.. 'సెక్స్' కూడా వాటితోనే! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః బెలూన్స్ అందరికీ ఇష్టమే. అయితే, జూలియస్‌కు బెలున్లంటే అమితమైన ప్రేమ. ఎంత ప్రేమంటే బెలూన్లతో సెక్స్ చేసేంత. అవును, అందరూ అందాన్ని అమ్మాయిల్లో చూస్తే ఈయనకి మాత్రం అందమంటే బెలూనే. ఈ ప్రేమ ఇప్పటిది కాదు 4 ఏళ్ల వయసులో మొదలై తన 62 పడిలోనూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జూలియస్ బుడగల ప్రేమికుడిగా వరల్డ్ ఫేమస్ పర్సన్. తనకు బెలూన్లపై ఉన్న లైంగిక వ్యసనం గురించి పలుమార్లు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇంతకీ, బెలూన్లంటే ఎందుకంత కోరిక అంటే.. సిల్కీగా, మృదువుగా, మెత్తగా, సున్నితంగా, కలర్‌ఫుల్‌గా ఉండటం వల్లే బెలూన్‌లపై లైంగిక ప్రేమ కలిగిందని అంటాడు. అందుకే, బెలూన్‌ని "నేను కౌగిలించుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను.., అది స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటుంది" అని చెబుతాడు.
జూలియస్ తన ఇంటిలో 50,000కు పైగా బెలూన్‌లు ఉంచుకుంటాడు. వీటిల్లో ప్రతిదానితో తనకు ప్రత్యేకమైన "కనెక్షన్ష ఉంటుందని చెబుతాడు. అందరూ అందంగా ఉన్న స్త్రీలను ఎలా ఇష్టపడతారో అలాగే తాను బెలూన్లను ఇష్టపడతానని అంటాడు. రోజూ రాత్రిపూట బెలూన్లతో నిండిన గదిలోనే నిద్రపోతాడు. అయితే, బెలూన్‌లలో జీవం లేదని తనకు తెలుసంటాడు. "కానీ వాటిపై నాకున్న ప్రేమే వాటిని సజీవంగా మార్చేలా చేస్తుందా" అని తానే కొన్నిసార్లు ఆశ్చర్యపోతానని చెబుతాడు. జూలియస్‌కు బెలూన్లపై ప్రేమ వ్యవహారం తన నాలుగేళ్ల వయసులో ప్రారంభమైందని, ఓ సారి ఆసుపత్రిలో చేరినప్పుడు తన తల్లి ఒక బ్లూ కలర్ బెలూన్ తీసుకొచ్చి, ఇచ్చినప్పుడు అది తనకు ఎంతో నచ్చిందని, అయితే అది పగిలినప్పుడు చాలా ఏడ్చానని అప్పటి నుంచే బెలూన్ అంటే ఓ విధమైన ఇష్టం ఏర్పడిందని చెబుతాడు జూలియస్. వాస్తవానికి, ఇలాంటి విచిత్రమైన, రకరకాల ఎడిక్షన్స్ ఉన్నోళ్లు భూమిపై కొందరున్నారు. అయితే, ప్రతి కోరిక వెనుక ఒక కథ కూడా ఉండటం విశేషం.