- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వారంలో ఇన్నిసార్లు sex చేస్తే మహిళలకు ఆ బెన్ఫిట్!
దిశ, వెబ్‌డెస్క్ః సెక్స్ కోరికలు సాధారణమే, అయితే సెక్స్‌కు కేవలం కోరికతో మాత్రమే సంబంధం పెట్టలేము. ఆరోగ్యం పరంగానూ సెక్స్ వల్ల చాలా ప్రయోజనాలను ఉన్నాయి. బెడ్ పైన చురుగ్గా ఉండటం అంటే ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవడమేనని అర్థం. అయితే, వారానికి ఎన్ని సార్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నామో దాన్ని బట్టి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, కనీసం వారానికొకసారి సెక్స్‌లో పాల్గొనే మధ్య వయసు మహిళల్లో రాబోయే పది సంవత్సరాల కాలంలో మెనోపాజ్ అవకాశం 28% తక్కువని తెలిసింది. ఇక, కనీసం నెలకు ఒకసారి సెక్స్ చేసేవారిలో రిస్క్ 19% తగ్గుతుందని కనుగొన్నారు.
యూనివర్శిటీ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు మేగాన్ ఆర్నోట్ మాట్లాడుతూ, "మహిళలు సెక్స్ చేయకపోతే, గర్భం దాల్చే అవకాశం ఉండదు. కాబట్టి, శరీరం కూడా దానికి అలవాటు పడి, ఓవ్యులేషన్ అవసరం లేదనుకుంటుంది. లైంగిక కార్యకలాపం లేనప్పుడు దాని వల్ల ఉపయోగం లేదని అనుకుంటుంది. ఇది మెనోపాజ్‌ను ప్రేరేపిస్తుంది" అని అన్నారు. అందుకే, సెక్స్ చేయడం శరీరంలో ఉత్తేజాన్ని పెంపొందించి, సైక్లింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
- Tags
- sex