యువతలో పెరిగిపోతున్న డిస్కౌంట్ మానియా.. ఒక్కరూపాయి తగ్గినా కొనాలనే ఆరాటంతో..

by Javid Pasha |
యువతలో పెరిగిపోతున్న డిస్కౌంట్ మానియా.. ఒక్కరూపాయి తగ్గినా కొనాలనే ఆరాటంతో..
X

దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చాక టెక్నాలజీ వినియోగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నేరుగా మార్కెట్లకు వెళ్లి షాపింగ్ చేసేవారు ఇప్పుడు కూర్చున్న చోటు నుంచే క్షణాల్లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేస్తున్నారు. అమెజాన్, ఫ్లిక్ కార్ట్, మీషో ఇలా రకరకాల యాప్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. కొందరు ఏ వస్తువుపై ఎలాంటి డిస్కౌంట్లు వచ్చాయో తరచుగా చూస్తుంటారు. కొన్నా కొనకపోయినా పలువురు ఈ విషయంలో ఉత్సాహం కనబరుస్తుంటారు. కొందరైతే తమకు నచ్చిన వస్తువుపై ఒక్క రూపాయి డిస్కౌంట్ ప్రకటించినా కొనాలని ఆరాట పడుతుంటారు. అయితే ఈ పరిస్థితి పలువురు యువతలో ఒక రుగ్మతగా మారుతోందని నిపుణులు చెప్తున్నారు. దీనినే ‘డిస్కౌంట్ మానియా’గా పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ఇది సైబర్ సెక్యూరిటీ సమస్యలను తెచ్చిపెడుతోంది.

ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్, పలు కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని వివిధ రకాలుగా యూజ్ చేసుకుంటున్నాయి. తద్వారా ఏదో ఒక రూపంలో ఆయా వ్యక్తుల అడ్రస్, మొబైల్ నెంబర్, ఏజ్ వంటి ఇన్ఫర్మేషన్‌ను సేకరిస్తుంటాయి. అయినప్పటికీ డిస్కౌంట్లు ప్రకటించగానే ఇదంతా మర్చిపోయి, ఏమాత్రం ఆలోచించకుండా, డబ్బు ఆదా అవుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 86 శాతం మంది తమ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ను వివిధ బ్రాండ్లకు అందచేస్తున్నారని యూజర్‌ టెస్టింగ్‌ అండ్ అండ్‌ వన్‌పోల్ సంస్థలు సంయుక్త సర్వేలో వెల్లడైంది.

80 శాతం మంది యువతీ, యువకులు తమకు ఏఐ గురించి తెలుసు అని నమ్ముతుండగా, ఆన్‌లైన్ షాపింగ్ సందర్భంగా 46 శాతం మంది మాత్రమే దానివల్ల కలిగే బెనిఫిట్స్ లేదా నష్టాల గురించి తెలుసుకో గలుగుతున్నారు. ఓవరాల్‌గా 86 శాతం మంది ఇంట్లో సరుకులు, క్లాతింగ్, ఇతర షాపింగ్‌ల సందర్భంగా ఏఐ ద్వారా అమర్చబడిన ఆటో ఆర్డర్ టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ సందర్భంగానే డిస్కౌంట్ల పేరుతో ఆయా సంస్థలు, కంపెనీలు పర్సనల్ డేటాను లాగేస్తున్నాయి. సాధారణ సమయాల్లో తమ పర్సనల్ డేటాను షేర్ చేసుకోవడానికి వెనుకాడే ప్రజలు డిస్కౌంట్ల పేరు వినగానే వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి ఏమాత్రం వెనుకాడట్లేదట. షాపింగ్ చేయాలనే ఆరాటం వాస్తవానికి ఒక మానియా లేదా రుగ్మతగా మారడమే ఈ పరిస్థితికి నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed