- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health benefits : చియా, సబ్జా విత్తనాల మధ్య తేడా ఏంటి.. వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసా..
దిశ, వెబ్‌డెస్క్ : బరువు తగ్గాలనుకునే వారు చాలా రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. అంతే కాదు డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. పచ్చి కూరగాయలు, మొలకలు లాంటి మాత్రమే కాకుండా చియా విత్తనాల వంటి వాటిని కూడా వారి డైట్ లో చేర్చుకుంటారు. ఈ విత్తనాలతో అనేక రకాల పానీయాలు తయారు చేయడమే కాకుండా ఎక్కువగా స్మూతీస్ వంటి వాటిలో కూడా వినియోగిస్తుంటారు. అయితే సబ్జాగింజలు, చియా విత్తనాలు రెండూ దగ్గరి పోలికలు ఉండడంతో చాలామంది వాటి మధ్య తేడాను గుర్తించలేకపోతుంటారు. అయితే ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. వీటిలో మంచి పోషకాలను ఉన్నప్పటికీ దేనిప్రాముఖ్యత దానికే. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా విత్తనాలు..
చియా విత్తనాలను సాల్వియా హిస్పానికా అనే శాస్త్రీయ నామంతో కూడా పిలుస్తారు. వీటిని నానబెడితే జెల్ లాగా, సాఫ్ట గా, మృదువుగా మారతాయి. వీటిని ఎక్కువగా వోట్ మీల్, ఫుడ్డింగ్, పానీయాలు తయారు చేసేందుకు ఉపయోగిస్తుంటారు.
సబ్జా విత్తనాలు..
సబ్జా గింజలు ముదురు నులుపు రంగులో చిన్నగా నిగనిగలాడుతూ ఉంటాయి. వీటిని చేతితో తాకినప్పుడు, లేదా నోట్లో వేసుకున్నప్పుడు చాలా స్ఫుటమైనవిగా అనిపిస్తుంది. అంతే కాదు ఈ సబ్జా గింజలను నీటిలో ఉంచినప్పుడు, అది చియా గింజల లాగా ఉబ్బి తెలుపురంగు కవచం లాగా ఏర్పడుతుంది. అంతే కాదు ఇది చియావిత్తనాల లాగా అస్సలు ఉండవు. వీటిని ఎక్కువగా ఫర్బత్, ఫలూడాలో ఉపయోగిస్తుంటారు.
చియా విత్తనాల ప్రయోజనాలు..
చియా సీడ్స్ ప్రోటీన్ కి మంచి మూలంగా చెబుతారు వైద్యనిపుణులు. అలాగే వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియంతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
సబ్జా విత్తనాల ప్రయోజనాలు..
మలబద్ధకం, మోషన్ ఫ్రీగా లేకుండా ఉన్నవారికి సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, వంటి అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఇది అధిక బరువుతో బాధపడేవారి బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.