ఆప్తుల మరణంతో గుండె బద్ధలైన సందర్భం.. హార్ట్ పనితీరు ఇలా..

by Disha Web |   ( Updated:2023-03-08 10:03:11.0  )
ఆప్తుల మరణంతో గుండె బద్ధలైన సందర్భం.. హార్ట్ పనితీరు ఇలా..
X

దిశ, ఫీచర్స్: అమ్మానాన్న లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆకస్మికంగా మరణిస్తే సదరు వ్యక్తి బాధ, భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరెప్పుడైనా గమనించారా? ఇటువంటి తీవ్రమైన భావోద్వేగాలకు గురిచేసే సంఘటనలు తరచూ ఎదుర్కొంటున్న వారిలో గుండె పనితీరులో మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెప్తున్నారు. తాత్కాలికంగా గుండె కండరాలు బలహీనపడి రక్తనాళాల పనితీరు సరిగ్గా ఉండదు. ప్రాణహానికి దారితీసే ఈ పరిస్థితినే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అని అంటారు. ఇది గుండెకు సంబంధించిన వ్యాధి కాగా దీన్ని గతంలో ‘టరోట్సుబో కార్డియోమయోపతీ’ అని పిలిచేవారు. అయితే ఇపుడు దీనిని ‘ఎపికల్ బెలూన్ సిండ్రోమ్’గా పిలుస్తున్నారు.

జీవితంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు, ఆత్మీయులు, ప్రేమించేవాళ్లు మరణించడం అనే బాధ వర్ణనాతీతం. ఇక వారు తిరిగిరారని తాము బతకడం కూడా కష్టమేనని భావించే స్థాయిగల సమస్యను ‘హార్ట్ టు బ్రేక్’అని పిలుస్తారు. ఇలాంటివి పురుషుల కంటే మహిళల్లో అధికంగా ఉంటాయి. ఈ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’తో తొమ్మిది రెట్లు ఎక్కువగా బాధపడుతున్నది మహిళలే. మామూలు ఆడవాళ్లతో పోలిస్తే భర్త చనిపోయిన మహిళలే ఈ సిండ్రోమ్‌తో ఎక్కువ బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. బాధ కలిగినప్పుడు అడ్రినల్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడికి లోనవుతారు. దాంతో హార్ట్‌లో బ్లడ్ సర్క్యూలేట్ అధికమై బెలూన్‌లా ఉబ్బి పగిలిపోతుంది. 55 సంవత్సరాలలోపు ఉన్న మహిళల్లో అయితే ఇది 7.5 రెట్లు. ఆ పై వయసు కలిగిన వాళ్లలో 9.5 శాతం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని అంచనా.

పరిష్కార మార్గాలు

భరించలేని బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరితోనూ పంచుకోకుండా లోలోనే కుమిలిపోవడం ఈ సమస్యకు అసలు కారణం. ఫ్రెండ్స్, కొలిగ్స్, బంధువులు, ఆత్మీయులుగా భావించే వ్యక్తులవద్ద సమస్య గురించి మాట్లాడితే మనసు కుదుట పడుతుంది. ఎక్కువగా బాధను భరించలేని వ్యక్తులు భావోద్వేగ పూరితమైన గుర్తులు, జ్ఞాపకాలకు దూరంగా ఉండటం మంచిది. ఒక వేళ బాధను తట్టుకోలేక కన్నీళ్లు ఉబికి వస్తుంటే అస్సలు ఆపుకోవద్దు. మనస్ఫూర్తిగా ఏడవాలి. ఒత్తిడి, ఒంటరితనం వంటివి వేధిస్తుంటే వాటి నుంచి బయటపడే మార్గాలను ఎంచుకోవాలి. విహారయాత్రకు, షాపింగ్‌‌లకు వెళ్తూ ఉండండి. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో మాట్లాడుతూ ఉండటం ఒంటరితనాన్ని దూరంచేస్తాయి.

భావోద్వేగాల నియంత్రణ

అయితే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ సమస్యకు ఇప్పటి వరకు పూర్తి కచ్చితమైన కారణాలు తెలియవు. కాకపోతే ఈ జబ్బు లక్షణాలు గుండెపోటు మాదిరే ఉంటాయి. ఛాతి నొప్పి, శ్వాసలో ఇబ్బంది, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవడం జరగవచ్చు. అయితే కరోనరీ ఆర్టరీలలో శాశ్వత డ్యామేజి మాత్రం ఉండదు. కనుక రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. గుండె పోటుకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇది. అయితే ఈ జబ్బును గురించిన పరిశోధనా ఫలితాలను ‘ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో పబ్లిష్ చేశారు. కాకపోతే ఇంతవరకు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు తగిన ట్రీట్మెంట్ ఏదీ కనుగొనలేదు. భావోద్వేగాల నియంత్రణ, ఒత్తిడి, బాధలు తగ్గించుకోవడం, మనసు కుదుటపడే వాతావరణం వంటివి దీనిని నివారించడంలో సహాయపడే అంశాలు.

ఇవి కూడా చదవండి : పెళ్లైన మహిళలకు ఒడి బియ్యం ఎందుకు పోస్తారో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed