- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
work culture.. పని సంస్కృతిలో మెంటల్ హెల్త్ సపోర్ట్‌తో పెరుగుతున్న ప్రొడక్టివిటీ
దిశ, ఫీచర్స్: ఎక్కడైతే మీరు ఎటువంటి భయం లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయగలుగుతారో.. అటువంటి కార్యాలయంలో, సంస్థలో గ్రేట్ ప్రొడక్టివిటీ ఉంటుందని నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ ఇల్‌నెస్ (National Alliance on Mental Illness) అధ్యయనం పేర్కొన్నది. నేటి పరిస్థితుల్లో వర్క్ ప్లేస్ కల్చర్‌పై ఈ సంస్థ అనేక అంశాలను వెల్లడించింది. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్యోగులు తాము పనిచేస్తున్న సంస్థలో మెంటల్ సపోర్ట్ పొందడంవల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది. ఇటువంటి ఎన్విరాన్‌మెంట్ వ్యక్తిగతంగాను, సంస్థ పరంగాను పాజిటివ్ ఎఫెక్ట్ చూపుతుందని స్పష్టం చేసింది. మెంటల్ హెల్త్ సపోర్ట్‌లేని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు దీనిపై డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఒకప్పుడు కార్యాలయంలో మెంటల్ హెల్త్ సపోర్ట్ గురించి సంభాషణలు కార్పొరేట్ కార్పెట్ కింద కొట్టుకుపోయాయని, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి అత్యధిక శాతం మారిపోయిందని సర్వే పేర్కొన్నది. గతంలో మానసిక సమస్యలను గుర్తించడంలో నిర్లక్ష్యం కొనసాగింది. కానీ నేడు 81శాతం ఆఫీసులు లేదా వర్క్ ప్లేస్ మేనేజ్‌మెంట్స్ ఎంప్లాయి మెంటల్ హెల్త్ సపోర్ట్‌పై ఫోకస్ పెట్టాయని సర్వేను విశ్లేషించిన నిపుణులు చెప్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, అవసరమైనప్పుడు మేమున్నామనే భరోసాను యాజమాన్యం ఇవ్వడంతో ఆయా సంస్థల్లో ప్రొడక్టివిటీ మరింత పెరుగుతోందని కనుగొన్నారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం నిరాశ, ఆందోళన వంటి మెంటల్ డిజార్డర్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చుతాయని, ఏటా సుమారు ఒక ట్రిలియన్ డాలర్లతో సమానమైన ఉత్పాదకతను కోల్పోయేలా చేస్తాయని సర్వే హైలెట్ చేసింది. అందుకే మెంటల్ హెల్త్ సపోర్ట్‌పై ఫోకస్ పెట్టడం అనేది కేవలం ఉద్యోగులకు మాత్రమేగాక, సంస్థలు, దేశాలు, ప్రపంచం కూడా గణనీయమైన ఆర్థిక రాబడిని పొందడంలో సహాయపడుతుందని నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ ఇల్‌నెస్ (NAMI) అధ్యయనం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కేవలం13 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయాల్లో మానసిక ఆరోగ్యం గురించి చర్చించుకోవడం ద్వారా సుఖంగా ఉంటున్నారు. అలాగే మెంటల్ హెల్త్ చాలెంజెస్‌ను ఎదుర్కొంటున్న 10 మంది ఉద్యోగులలో 9 మంది వర్క్ ప్లేస్‌లలోనే ఎక్కువ స్ట్రెస్ అనుభవిస్తున్నట్లు NAMI పేర్కొన్నది. ఈ పరిస్థితి నివారించడానికి కార్యాలయాల్లో లేదా వర్క్ ప్లేస్‌లో అవసరమైన మెంటల్ హెల్త్ సపోర్టివ్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది.
tag: Work culture, mental health supportmental health support, a key elements, NAMI study
slug :
photo: