Tattoos effect : టాటూస్ వేయించుకున్నవారు బ్లడ్ డొనేట్ చేయకూడదా..? నిపుణుల వివరణ ఇదే..

by Javid Pasha |
Tattoos effect : టాటూస్ వేయించుకున్నవారు బ్లడ్ డొనేట్ చేయకూడదా..? నిపుణుల వివరణ ఇదే..
X

దిశ, ఫీచర్స్ : నచ్చిన సింబల్స్, ఫ్లవర్స్, వ్యక్తుల పేర్లు.. ఇలా రకరకాల టాటూస్ శరీరంపై వేయించుకోవడం కొందరు ఫ్యాషన్‌‌గా భావిస్తారు. మెడ, వీపు, నుదురు, చేతులు, పొట్ట, పాదాలు వంటి భాగాల్లో యువత వాటిని రకకాల డిజైన్లలో వేయించుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగానూ ఈ టూటూస్ క్రేజ్ పెరుగుతోంది. ఇదంతా పక్కన పెడితే.. టాటూస్ వేయించుకున్న వారు రక్తదానం చేయకూడదని చెప్తుంటారు. కొంతమంది వైద్యులు కూడా అత్యవసర పరిస్థితిలో వీరి నుంచి రక్తం తీసుకోవడానికి అంగీకరించరు. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

చాలా వరకు శరీరంపై పచ్చబొట్టు ఉన్నవారి నుంచి రక్తం సేకరించేందుకు బ్లడ్ బ్యాంకులు గానీ, డాక్టర్లు గానీ వెంటనే అంగీకరించరు. టాటూస్ వల్ల బాడీలో ఏవైనా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వైద్య నిపుణులు పేర్కొంటారు. ఇక టాటూస్ ఉన్నవారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎలాంటి లోపాలు, అంటు వ్యాధులు లేవని నిర్ధారించడానికి సమయం పడుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ టైమ్‌లో పచ్చబొట్టు ఉన్న వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

అయితే ఇటీవల ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ప్రతీ వంద మందిలో కనీసం 40 మందికి టాటూస్ ఉంటున్నాయని అంచనా. కాబట్టి వారి ద్వారా కూడా రక్తం సేకరించేందుకు ‘రెడ్ క్రాస్’ నిపుణులు కొన్ని నియమ, నిబంధనలు విధించారు. ఏంటంటే.. టాటూస్ వేయించుకున్న వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సరం రవకు బ్లడ్ డొనేట్ చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత మాత్రమే చేయడానికి అర్హులు. అయితే టాటూస్ ఉన్న వ్యక్తికి అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు చేశాక ఎలాంటి సమస్య లేదని వైద్యులు నిర్ధారించడం ఉత్తమమైన మార్గంగా నిపుణులు పేర్కొంటున్నారు. టాటూస్ ఇప్పుడొక కళగా, ఫ్యాషన్‌గా చలామణి అవుతోంది. కాబట్టి దానిని వేసేవారు ఎప్పుడూ కొత్త సూదులు, కొత్త పరికరాలు వంటివి మాత్రమే వాడాలని, ఒకరికి వాడినవి మరొకరికి వాడితే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed