- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tattoo: టాటూల ఇంక్‌తో క్యాన్సర్ ప్రమాదం.. ఎండ పడితే అంతే..?!
దిశ, వెబ్‌డెస్క్ః టాటూలంటే కొందరికి ఫ్యాషన్ మాత్రమే కాదు ప్యాషన్ కూడా. అందుకే, కొందరు ఒళ్లంతా రకరకాల టాటూలు పొడిపించుకుంటారు. అయితే, పచ్చబొట్టులంటే పిచ్చి ఇష్టం ఉన్నవారికి ఒక పచ్చి నిజం చెబుతున్నారు పరిశోధకులు. టాటూల ఇంక్‌పై చేసిన అధ్యయనాల్లో పరిశోధకులు పరీక్షించిన దాదాపు సగం పచ్చబొట్టు ఇంక్‌లలో క్యాన్సర్ కలిగించే రసాయనంగా మారే పదార్ధం ఉందని కనుగొన్నారు. స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్‌లో శాస్త్రవేత్తలైన పి.హెచ్‌డీ స్కాలర్ జాన్ స్వియర్క్ నేతృత్వంలో దాదాపు 100 టాటూ ఇంక్‌లను విశ్లేషించారు. ఇక, టాటూలు వేసే వారికి వాటి కాంబినేష్ గురించి "వాస్తవానికి చాలా తక్కువగా తెలుసు" అని కూడా క్షేత్రస్థాయి ఇంటర్వ్యూలల్లో తెలుసుకున్నారు.
నిజానికి, టాటూలలో ఉపయోగించే ఇంక్‌లు పిగ్మెంట్, క్యారియర్ సొల్యూషన్‌ను కలిగి ఉంటాయి. ఇది రంగు పదార్థాన్ని చర్మంలో నిలకడగా ఉండేలా చేస్తుంది. తద్వారా టాటూ శరీరంపై అలాగే ఉండిపోతుంది. ఇక, ఈ పరిశోధక బృందం విశ్లేషించిన 56 ఇంక్‌లలో 23 ఇంక్‌లు అజో అనే పదార్థాన్ని కలిగిన రంగు ఉనికిని సూచించాయి. ఈ అజో రంగులు ఆహారంలో, సౌందర్య సాధనాల్లో, దుస్తులతో సహా వివిధ రకాల వినియోగ వస్తువుల్లోనూ ఉపయోగించే సింథటిక్ రంగులు. ఇవి రసాయనికంగా చెక్కుచెదరకుండా ఉన్నప్పుడు సురక్షితంగానే ఉన్నప్పటికీ, అవి బాక్టీరియాతో గానీ లేదంటే అతినీలలోహిత కాంతి ద్వారా అధోకరణం చెందడం వల్ల క్యాన్సర్ కలిగించే సమ్మేళనంగా మారుతాయని స్టడీలో వెల్లడించారు.
అంటే, ఎవరైనా పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల బాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే, టాటూ వేసే క్రమంలో పరికరాలను సరిగ్గా శుభ్రం చేయకపోతే చర్మం చీలడం లేదా హెపటైటిస్-బి (కామెర్లు), సి, వంటి రక్తంతో సంక్రమించే వ్యాధి, కాలక్రమేణా పచ్చబొట్టు మచ్చ కణజాలం చుట్టూ నోడ్యూల్స్, గ్రాన్యులోమాలు కూడా అభివృద్ధి కావచ్చని పేర్కొన్నారు. ఇక, కొన్ని రకాలైన 23 పిగ్మెంట్లు, సాధారణంగా నీలం రంగులు (బ్లూస్), పసుపు పచ్చ రంగు (గ్రీన్స్) కూడా అజో సమ్మేళనాలను కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. అవి ఎక్కువ సూర్యరశ్మికి లేదంటే అధిక బ్యాక్టీరియాకు గురైనట్లయితే 'క్యాన్సర్ కారకం'గా మారవచ్చని హెచ్చరించారు.