పీరియడ్స్ టైంలో ప్యాడ్స్‌కు బదులు టాంపాన్స్ వాడుతున్నారా? క్యాన్సర్ హెచ్చరికలు జారీ..

by Sujitha Rachapalli |
పీరియడ్స్ టైంలో ప్యాడ్స్‌కు బదులు టాంపాన్స్ వాడుతున్నారా? క్యాన్సర్ హెచ్చరికలు జారీ..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా పీరియడ్స్ టైంలో మహిళలు ప్యాడ్స్ యూజ్ చేస్తుంటారు. కానీ కొందరు టాంపాన్స్ కూడా వాడుతుంటారు. ముఖ్యంగా యూఎస్ లో 52%, యూకేలో 82% మంది మహిళలు వీటిని వినియోగిస్తారు. బ్లీడింగ్ హెవీగా ఉన్నప్పుడు లీక్ కాకుండా ఎంప్లాయిస్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ పద్ధతి ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటిపై జరిపిన తాజా అధ్యయనంలో ఆర్సెనిక్, సీసం, పాదరసం, నికెల్, రాగి, ఇనుముతో సహా 16 విషపూరితమైన లోహాలు ఉన్నట్లు గుర్తించారు. 14 బ్రాండ్‌లకు చెందిన 30 టాంపోన్‌లను విశ్లేషించిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడించారు.

ముఖ్యంగా యోనితో ఈ లోహాలు ఎక్స్ పోజ్ అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. యోని ద్వారా ఈ లోహాలు శోషించబడినట్లయితే చిత్తవైకల్యం, క్యాన్సర్, వంధ్యత్వం, మధుమేహం ప్రమాదాలు తలెత్తొచ్చు. లోహ శోషణ కాలేయం, మూత్రపిండాలు, మెదడు, హృదయనాళ, నాడీ, ఎండోక్రైన్ వ్యవస్థలలో కూడా సమస్యలను సృష్టిస్తుంది. ఈ లోహాలు పుట్టబోయే పిల్లలకు కూడా హానికరం. కాగా ఆర్గానిక్ టాంపాన్‌లలో అధిక స్థాయిలో ఆర్సెనిక్ ఉన్నట్లు కనుగొన్న అధ్యయనం.. నాన్ ఆర్గానిక్ వాటిలో ఎక్కువగా సీసం ఉన్నట్లు గుర్తించింది. ఏ బ్రాండ్‌ల టాంపోన్‌లు సురక్షితం కాదని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed