- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాఫీ పాడ్స్‌కు గ్రీన్ ఆల్టర్నేటివ్.. ఆవిష్కరించిన స్విస్ కంపెనీ
దిశ, ఫీచర్స్ : మనలో చాలా మందికి స్టీమింగ్ కాఫీ అనేది దినచర్యలో ఓ ముఖ్యమైన భాగం. కానీ కాఫీ యంత్రాల్లో ఉపయోగించే అల్యూమినియం, ప్లాస్టిక్ పాడ్స్.. పర్యావరణ వ్యర్థాలకు సంబంధించి అత్యంత హానికర వనరుల్లో ఒకటి. ఈ నేపథ్యంలోనే 'Migros' అనే స్విస్ కంపెనీ కాఫీ క్యాప్సూల్స్‌కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. CoffeeB(కాఫీ బాల్స్)గా పిలువడే ఘనరూపంలోని ఈ కాఫీ గోళాలు క్యాప్యూల్స్ మాదిరి మెషిన్‌లో కరిగిపోతాయి.
ఈ గోళాలు ఫ్యూచర్‌లో సరైన మోతాదులో కాఫీ తాగేందుకు సాయపడతాయని CoffeeB హెడ్ ఫ్రాంక్ వైల్డ్ హామీనిచ్చారు. కాలక్రమేణా ప్లాస్టిక్ క్యాప్సూల్ సిస్టమ్స్ తొలగించబడతాయని విశ్వసిస్తు్న్నట్లుగా తెలిపారు. ఇది క్యాప్సూల్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడమే కాక సాంప్రదాయ క్యాప్సూల్ కాఫీ వలె రుచిగా ఉండటమే అందుకు కారణమని పేర్కొన్నారు. అయితే మొత్తం పరివర్తనకు సమయం పడుతుందని, ఎలక్ట్రిక్ కార్స్ ట్రెండ్ మాదిరి ఒక సమూలమైన మార్పు రాత్రికిరాత్రే జరగదని అభిప్రాయపడ్డారు.
కాఫీ బాల్స్ ఎలా పని చేస్తాయి?
కాఫీ బంతులు అతి-సన్నని కంపోస్టబుల్ బయటి పొరతో కలిసి ఉంటాయి. ఈ పొర కరగదు, తాగడానికి ముందు కాఫీ గ్రౌండ్స్‌తో తీయబడుతుంది. వీటిని తప్పనిసరిగా 'ది గ్లోబ్' అని పిలవబడే ప్రత్యేక యంత్రంలో ఉంచాలి. దీని పనితీరులో పోలికలున్నప్పటికీ 'నెస్ప్రెస్సో, లావాజా, ఇల్లీ, క్యూరిగ్' వంటి ప్రస్తుతమున్న క్యాప్సూల్ దిగ్గజాల ఉపకరణాలకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థ. ఇక వేర్వేరు పరిమాణాల్లో ఉండే ఈ కాఫీ బాల్స్ ప్రతి ఒక్కటి 40 నుంచి 110 మిల్లీలీటర్ల కాఫీని తయారు చేయగలవు.
ఈ వారమే స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లో ప్రారంభించబడుతున్న CoffeeB.. 2023 వరకు జర్మనీకి విస్తరించే ప్లాన్‌లో ఉంది. కాగా తొమ్మిది కాఫీ బాల్స్ ప్యాక్ ధర రూ. 380(స్విట్జర్లాండ్‌లో 4.60 CHF.). గ్లోబ్ మెషిన్ ధర దాదాపు రూ. 14000/-.