తినేటప్పుడు చెమటలు పడుతున్నాయా? లైట్ తీసుకోవద్దని నిపుణుల హెచ్చరిక

by Sujitha Rachapalli |
తినేటప్పుడు చెమటలు పడుతున్నాయా? లైట్ తీసుకోవద్దని నిపుణుల హెచ్చరిక
X

దిశ, ఫీచర్స్: కొందరికి తినేటప్పుడు చెమటలు పడుతుంటాయి. మెడ, ముఖం, తల, నుదిటిపై ధారలు కారుతుంటాయి. దీన్ని గస్టేటరీ స్వెట్ లేదా ఫ్రే సిండ్రోమ్ అని పిలుస్తుండగా.. ఇది అంతర్లీన అనారోగ్య సమస్యకు సంకేతమని, లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారంగా ఉండే ఆహారం తిన్న తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరిగి ఇలా జరుగుతుందని.. క్యాప్సైసిన్ అనే ఎంజైమ్ ఇందుకు కారణమని తెలిపారు. కాగా ఈ పరిస్థితి ఎవరిలో వస్తుంది? అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తెలుసుకుందాం.

తల, మెడకు శస్త్ర చికిత్స

మెడ లేదా తల శస్త్రచికిత్స కూడా అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. సర్జరీ జరిగిన వారిలో పరోటిడ్ గ్రంధి తొలగించబడినప్పుడు.. ఈ శస్త్రచికిత్స ప్రమాదవశాత్తూ సమీపంలోని నరాలకు హాని కలిగిస్తుందని నమ్ముతారు. ఫలితంగా చెమట పట్టడం వంటి కొన్ని మిశ్రమ నరాల సంకేతాలు వస్తాయి. మనం తిన్నప్పుడు మన శరీరం సహజంగానే ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేస్తుంది. కానీ, పరోటిడ్ గ్రంధుల నుంచి నరాలు దెబ్బతిన్నట్లయితే.. మీ శరీరం లాలాజలానికి బదులుగా చెమట పట్టడం ప్రారంభించవచ్చు.

మీట్ స్వెట్స్

దీన్ని కొంతమంది డైటీషియన్లు మీట్ స్వెట్స్ గా పరిగణిస్తారు. అధిక ప్రోటీన్ కలిగిన భోజనం తీసుకున్న తర్వాత అధిక చెమటను వస్తుంది. ఎందుకంటే ప్రోటీన్ విచ్ఛిన్నం అధిక జీవక్రియ రేటును కలిగి ఉంటుంది. అందువల్ల శరీర ప్రతిస్పందన చెమట ద్వారా చల్లబడుతుంది. కాబట్టి ఆహారంలో ప్రొటీన్‌ను బ్యాలెన్స్ చేయడం.. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవాలి. తద్వారా చెమట రావడం తగ్గిపోతుంది.

మద్యపానం

ఆల్కహాల్ తీసుకున్నాక బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. దీనివల్ల చెమట అధికం అవుతుంది. కాబట్టి మందు తాగాక శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి.

నివారణ చర్యలు

* వైద్యులు మెడిసిన్ ప్రిస్ స్క్రైబ్ చేస్తారు. చెమట వచ్చే ప్రాంతాల్లో అప్లయ్ చేయడానికి యాంటీపెర్స్పిరెంట్స్ ఇస్తారు. యాంటికోలినెర్జిక్స్ వంటి మందులు చెమటను అరికట్టవచ్చు.

* ఫ్రే సిండ్రోమ్.. ముఖ్యంగా ఆక్సిలరీ హైపర్‌హైడ్రోసిస్‌కు బొటాక్స్ ఇంజెక్షన్‌లు ప్రాథమిక చికిత్స ఎంపిక.

* ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు చెమట వస్తుందో తెలుసుకుని.. వాటిని అవాయిడ్ చేయడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed