పేగు ఆరోగ్యంపై 24/7 అప్‌డేట్స్ అందించే మాత్ర.. త్వరలోనే అందుబాటులోకి

by sudharani |   ( Updated:2022-12-03 14:48:29.0  )
పేగు ఆరోగ్యంపై 24/7 అప్‌డేట్స్ అందించే మాత్ర.. త్వరలోనే అందుబాటులోకి
X

దిశ, ఫీచర్స్: పేగులలోని గ్లూకోజ్ స్థాయిలు జీర్ణశయాంతర ఆరోగ్యానికి ప్రధాన సూచిక. కాగా ప్రస్తుతం రోగి గొంతు ద్వారా కాథెటర్‌(ఫ్లెక్సిబుల్ ట్యూబ్)ను పంపించి, ఈ లెవల్స్‌ను గుర్తించడం జరుగుతుంది. అయితే త్వరలో ఒక చిన్న 'స్మార్ట్ పిల్' ద్వారా ఈ పని పూర్తి చేయబోతున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగోలో ఈ మింగేందుకు వీలయ్యే పిల్‌ను డిజైన్ చేసిన సైంటిస్టులు.. బయోసెన్సార్ అండ్ బయోఫ్యూయల్ కాంబినేషన్ అయిన సెల్.. 3D ప్రింటెడ్ పాలిమర్ సెల్‌లో ఉంచబడినట్లు తెలిపారు. ఒకసారి దీన్ని తీసుకున్న తర్వాత చిన్న ప్రేగులలో గ్లూకోజ్ స్థాయిలను కంటిన్యూయస్‌గా మెజర్ చేస్తూ అప్‌డేట్స్ అందిస్తుందని తెలిపారు.

'మాగ్నెటిక్ హ్యూమన్ బాడీ కమ్యూనికేషన్' అని పిలువబడే శక్తి-సమర్థవంతమైన సాంకేతికతను ఉపయోగించి ఈ పిల్ వైర్‌లెస్‌గా రీడింగ్‌లను ప్రసారం చేస్తుంది. ఇది రోగి శరీర కణజాలం ద్వారా అల్ట్రా-లో-పవర్ అయస్కాంత పల్స్‌లను పంపుతుండగా.. ఇవి శరీరం వెలుపల ధరించే రిసీవర్-కాయిల్-అమర్చిన పరికరం ద్వారా గుర్తించబడి, డీకోడ్ చేయబడతాయి.


మానవుల మాదిరిగానే జీర్ణశయాంతర ప్రేగులను కలిగి ఉన్న పందులపై నిర్వహించిన పరీక్షలలో.. ఈ మాత్ర 14 గంటలపాటు చిన్న ప్రేగులలో గ్లూకోజ్ స్థాయిలను విజయవంతంగా పర్యవేక్షించింది. రెండు నుంచి ఐదు గంటల వరకు.. ప్రతీ ఐదు సెకన్లకు రియల్-టైమ్ డేటాను ట్రాన్స్‌మిట్ చేసింది. ఇక ఈ మాత్రను మానవులపై ట్రయల్ చేసేందుకు కొంచెం చిన్నదిగా చేయాలని తెలిపిన శాస్త్రవేత్తలు.. ప్రస్తుతం ఈ పిల్ 2.6 సెం.మీ పొడవు 9 మి.మీ వెడల్పు ఉన్నట్లు తెలిపారు. మరిన్ని సెన్సార్స్ యాడ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు చెప్పారు.

READ MORE

నేను తిని, పడుకుంటే రూ.కోటి జీతం ఇస్తున్నారు.. ఫిర్యాదు చేసిన ఎంప్లాయి

Advertisement

Next Story

Most Viewed