- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారంపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన సర్వే... ఆ రోజు ఆ టైమ్ బెస్ట్... వరెస్ట్ మాత్రం..
దిశ, ఫీచర్స్ : లగ్జరీ లోదుస్తుల రిటైలర్ పోర్ మోయి నిర్వహించిన సర్వేలో శృంగారం గురించి ఆసక్తికర విషయాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సెక్స్‌లో పాల్గొనేందుకు ఖచ్చితమైన రోజు, సమయం ఉంటుందని గుర్తించింది. అది శనివారం కాగా సమయం రాత్రి 10:09 గంటలు. 43 శాతం మంది ఇందుకే ఓటు వేయగా.. తర్వాత లిస్ట్ లో శుక్రవారం 22 శాతం, ఆదివారం 10 శాతం, గురువారం 6 శాతంతో ఉన్నాయి. ఇక రెండు శాతంతో సోమవారం చివరి స్థానంలో ఉండగా... అస్సలు ఇంట్రెస్ట్ చూపని సమయంగా మండే మధ్యాహ్నం 1:02 గంటలుగా గుర్తించారు. ఈ టైంలో లైంగిక కార్యకలాపాలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉందని తెలిపారు.
ఇక ఎంత తరుచుగా శృంగారంలో పాల్గొంటారనే ప్రశ్న కూడా అడిగింది సర్వే. బిజీ వర్క్ షెడ్యూల్స్, ఇతర వ్యక్తిగత పనుల కారణంగా చాలా మంది వ్యక్తులు(దాదాపు 48% మంది) వారానికి ఒకసారి మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నట్లు తేలింది. 19 శాతం మంది వారానికి రెండుసార్లు, 13 శాతం మంది వారానికి మూడు సార్లు, ఏడు శాతం మంది వారానికి నాలుగు సార్లు సన్నిహితంగా ఉంటున్నారు. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే రోజూ సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇక ఈ విషయంలో పురుషులు, మహిళల ఫ్రీక్వెన్సీ భిన్నంగా ఉంది. 24- 45 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు.. వారానికి రెండు సార్లు భాగస్వామితో ఇంటిమసీగా ఉంటున్నట్లు చెప్తే.. స్త్రీలు వారానికి నాలుగు సార్లు పార్టనర్ తో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Psychological complexes : అపరాధ భావం నుంచి అత్యుత్సాహం వరకు.. భిన్న మానసిక ధోరణులివే..