సమ్మర్‌లో చెమటతో విసిగిపోతున్నారా? కానీ బోలెడన్ని లాభాలున్నాయండోయ్..

by Sujitha Rachapalli |
సమ్మర్‌లో చెమటతో విసిగిపోతున్నారా? కానీ బోలెడన్ని లాభాలున్నాయండోయ్..
X

దిశ, ఫీచర్స్: బయట ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి తాపానికి జనాలు విలవిలలాడిపోతున్నారు. అయితే సమ్మర్‌లో ఎండతోపాటు అత్యంత ఇబ్బందిపెట్టే అంశం చెమట. ఎండలో కాసేపు నడిచినా, కరెంట్ కట్ అయినా బాడీ పూర్తిగా స్వెట్ వచ్చేస్తుంది. బట్టలు తడిసిపోయి శరీరం నుంచి దుర్వాసన వెదజల్లుతుంది. అయితే చెమట కారణంగా ఇలా అసౌకర్యానికి గురవుతుంటాం కానీ దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. మన బాడీ నేచురల్ కూలింగ్ మెకానిజమ్‌లో ఒకటైన చెమట.. శరీరం నుంచి అదనపు వేడిని తొలగించడం, వడదెబ్బ నుంచి కాపాడటంతోపాటు డిటాక్సిఫికేషన్‌లోనూ కీలకపాత్ర పోషిస్తుంది.


నేచురల్ కూలింగ్ సిస్టమ్

చెమట అనేది శరీరపు సహజమైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరం చెమట గ్రంథుల ద్వారా తేమను చర్మం ఉపరితలానికి విడుదల చేస్తుంది.ఈ తేమ ఆవిరైపోయినప్పుడు వేడి తగ్గిపోయి.. బాడీ టెంపరేచర్‌ను సమర్థవంతంగా తగ్గిస్తుంది. తద్వారా వడదెబ్బకు గురికాకుండా చేస్తుంది.


డిటాక్సిఫికేషన్ అండ్ పూరిఫికేషన్

చెమటను డిటాక్సిఫికేషన్‌గా కూడా ట్రీట్ చేస్తారు. పురాతన పద్ధతులు, మోడ్రల్ వెల్‌నెస్ ట్రెండ్స్‌లోనూ ఈ కాన్సెప్ట్ పాతుకుపోయింది. దీని ఫస్ట్ టాస్క్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడం అయితే.. బాడీ నుంచి టాక్సిన్స్, మలినాలను తొలగించడం సెకండ్ టాస్క్.ఆల్కహాల్, కొలెస్ట్రాల్, సాల్ట్ వంటి పదార్థాలను బయటకు పంపించి.. శారీరక వ్యవస్థను శుద్ధి చేస్తుంది. క్లియర్ స్కిన్, మొటిమల తగ్గింపుకు దోహదం చేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్

చెమట రోగనిరోధక శక్తిని పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులోని యాంటీమైక్రోబయల్ పెప్టైడ్స్.. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లకు వ్యతిరేకంగా ఎఫెక్ట్ చూపుతుంది. చెమట గ్రంథులలో ఉత్పత్తి అయ్యే పెప్టైడ్, డెర్మ్సిడిన్ చర్మం ఉపరితలంపై హానికరమైన వ్యాధికారక కారకాలతో పోరాడుతుంది. అంటే అంటువ్యాధుల నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

స్ట్రెస్ రిలీవర్

వ్యాయామం, ఆవిరి పట్టడం వంటి చెమటను ప్రేరేపించే శారీరక కార్యకలాపాలు సహజ నొప్పి నివారణలైన ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. ఈ 'ఫీల్-గుడ్' హార్మోన్లు తరచుగా 'రన్నర్స్ హై' అని పిలువబడే ఉత్సాహ స్థితికి దారితీస్తాయి. జీవితంపై సానుకూల, శక్తివంతమైన దృక్పథంతో ఉండేలా చేస్తాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతంగా ఉండేందుకు కారణమవుతాయి.

స్కిన్ హెల్త్

చెమట చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. స్కిన్‌పై హోల్స్ ఓపెన్ చేయడం ద్వారా ధూళి, నూనె, ఇతర మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. బ్లాక్ హెడ్స్, మొటిమల రావడాన్ని తగ్గిస్తుంది. స్కిన్ టోన్‌ను పెంచి అందాన్ని పెంచుతుంది. మలినాలను గ్రహించకుండా చర్మాన్ని శుభ్రపరుస్తూ.. నేచురల్ ఎక్స్ఫోలియంట్‌గా వర్క్ చేస్తుంది.


Advertisement

Next Story

Most Viewed