- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay – Trivikram : లైఫ్ లో ఇంకా చాలా సక్సెస్ అవ్వాలంటూ విజయ్ మీద వాఖ్యలు చేసిన త్రివిక్రమ్
దిశ, వెబ్ డెస్క్ : దుల్కర్ హీరోగా తెరకెక్కిన సినిమా లక్కీ భాస్కర్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 31న విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆదివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
అయితే, ఈ ఈవెంట్లో త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ " నా బాగా నచ్చే నటులలో విజయ్ కూడా ఒకరు. ఇతను ఎంత ప్రేమని చూసాడో అంతకంటే ఎక్కువ ద్వేషం కూడా చూసాడు. చిన్న వయస్సులోనే ఈ రెండు చూసాడంటే చాలా గుండె ధైర్యం ఉంది విజయ్ కి, జీవితం ఇంకా చాలా చూడాలి, సక్సెస్ అవ్వాలని " అన్నారు.
వరుస హిట్స్, వరుస ఫ్లాప్స్ చూసిన విజయ్ కి ఇలా ధైర్యం చెప్పినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు యాటిట్యూడ్ కా బాప్ అని అతనిపై విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు విజయ్ చాలా కూల్ అయ్యారు. అయినా కూడా తీసిన సినిమాలు హిట్ కావడం లేదు. " VD12 " హిట్ తో గండం నుంచి బయటపడతాడేమో చూడాల్సి ఉంది.
Read More..