గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం

by Mahesh |   ( Updated:24 March 2025 9:26 AM  )
గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ క్రికెటర్ గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలి ఆస్పత్రి పాలైన ఘటన బంగ్లాదేశ్ (Bangladesh) లోని ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌ (Dhaka Premier Division Cricket League)లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ తమిమ్ ఇక్బాల్ (Tamim Iqbal)మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్- షైన్‌పుకూర్ క్రికెట్ క్లబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గుండెపోటు (heart attack) రావడంతో ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించి.. సమీపంలోని ఫజిలతున్నెసా హాస్పిటల్‌కు తరలించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ మెడికల్ ఆఫీసర్ దేబాశిస్ చౌదరి ప్రకారం.. తమిమ్‌కు ఇప్పటికే రెండు సార్లు గుండెపోటులు వచ్చాయి. ప్రస్తుతం అతను వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికి.. అతని పరిస్థితి కొంత విషమంగా ఉంది.

తమీమ్ కు కార్డియాక్ విభాగంలో చికిత్స చికిత్స అందించిన తర్వాత పరిస్థితి కొంత మెరుగు పడినట్లు సమాచారం. ఢాకాలోని ఎవర్‌కేర్ హాస్పిటల్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించాలని ప్రయత్నించినప్పటికీ, అతని ఆరోగ్య పరిస్థితి అనుకూలించకపోవడంతో స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స కొనసాగిస్తున్నారు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లలు ఆడగా.. అన్ని ఫార్మట్లలో కలిపి 15,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. కాగా తమిమ్‌కు గుండెపోటు వచ్చి ఆస్పత్రిపాలైన సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌లో ముంచెత్తింది. ఈ విషయ తెలుసుకున్న అభిమానులు, సహచర ఆటగాళ్లు, ప్రముఖులు అతను త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Next Story