Tummala: 13 జిల్లాల్లో భారీగా పంట నష్టం.. పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Prasad Jukanti |
Tummala: 13 జిల్లాల్లో భారీగా పంట నష్టం.. పరిహారంపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై (Crop Damage) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ప్రకటన చేశారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతు వారీ సర్వే చేసి తుది నివేదిక రూపొందించాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ నెల 21 నుండి 23 వరకు కురిసిన వడగళ్ల వానల ప్రభావంతో పంటనష్టంపై ప్రాథమిక నివేదిక అందింది. దీని ప్రకారం దాదాపు 13 జిల్లాల్లో 64 మండలాల్లో 11,298 ఎకరాలలో నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాలలో మామిడి, మిగలినవి ఇతర పంటలు ఉన్నాయి.

Next Story