పార్లమెంటులో అరకు కాఫీ ఘుమ ఘుమలు

by Anil Sikha |
పార్లమెంటులో అరకు కాఫీ ఘుమ ఘుమలు
X

దిశ డైనమిక్ బ్యూరో: పార్లమెంటు ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాల్ ను ఈరోజు ప్రారంభించారు.లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాజరైన గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టీడీపీ, బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. తొలుత అరకు కాఫీ ఉత్పత్తులను లోక్​సభ స్పీకర్​కు మంత్రి సంధ్యారాణి అందజేశారు.

Next Story

Most Viewed