బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారే టార్గెట్‌గా పోలీసుల దూకుడు

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-24 14:40:18.0  )
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారే టార్గెట్‌గా పోలీసుల దూకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ కేసు(Betting Apps Case)లో కీలక మలుపు చోటుచేసుకున్నది. మెయిన్ టార్గెట్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. యాప్ నిర్వహకులే(Apps Administrators) టార్గెట్‌గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటివరకు 19 మంది నిర్వహకులపై కేసులు నమోదు చేశారు. వారిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని.. మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్‌(Betting Apps)ను ప్రమోట్ చేసిన వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. అయితే ఈ చార్జిషీట్‌లో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రచారం చేసిన ఇన్‌ఫ్యుయెన్సర్లను సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్‌కు నిర్వహకులే బాధ్యులుగా తేలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు పోలీసులు. వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వహకులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో దాదాపు 8 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మందిపై కేసులు నమోదు చేశారు.

మరోవైపు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన కేసులో వైసీపీ(YCP) నాయకురాలు, ప్రముఖ యాంక‌ర్ శ్యామ‌ల(Anchor Shyamala) కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీసుల(Panjagutta Police) ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దాంతో న్యాయ‌స్థానం శ్యామ‌ల‌ను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా ఆమెకు సూచించింది.

Read More..

‘VT-15’ పూజా కార్యక్రమాలు స్టార్ట్.. ఆకట్టుకుంటున్న హీరో, హీరోయిన్ ఫొటోలు(పోస్ట్)

Next Story

Most Viewed