- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వేసవి వచ్చేసింది.. మీ రోజూ వారి ఆహారంలో కచ్చితంగా పెసరపప్పును చేర్చుకోవాల్సిందే.. ఎందుకంటే?

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల సరైనా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. ఈ సందర్భంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పెసర పప్పును వేసవిలో రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు రెగ్యులర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక దీనిని పెసర పప్పు చారు, కూర, పెసరట్టు, స్ప్రౌట్స్, స్నాక్స్.. ఇలా చాలా రకాలుగా తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ A, B, C, E, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం, ఫైబర్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే గుణాల కారణంగా రోజూ వారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎండకాలంలో శరీరంలో వేడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. పెసల్ని రెగ్యులర్‌గా తింటే యవ్వనంగా కనిపిస్తారు. ఇందులోని కాపర్ చర్మంపై ముడతల్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్‌ని నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి.
అలాగే హైబీపీ ఉన్నవారికి పెసలు చాలా మంచివి. రెగ్యులర్‌గా పెసలని ఏదో రకంగా తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ అదుపులో ఉంటుంది. ఇందులోని ఐరన్ శరీరంలోని అవయవాలకి ఆక్సీజన్‌ని సమృద్ధిగా అందిస్తుంది. అందుకే పెసలను రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెసర పప్పును తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా.. త్వరగా కడుపు నిండుతుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు, పెసలని తినడం వల్ల బ్రెయిన్ హెల్దీగా మారుతుంది.
Read More ....
Exercise: ప్రతి రోజూ వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిదే!