సక్సెస్‌ఫుల్ పీపుల్ వీకెండ్స్ ఎలా గడుపుతారో తెలుసా? .. మీరు ట్రై చేస్తే పక్కా శాటిస్‌ఫై అవుతారు

by Sujitha Rachapalli |
సక్సెస్‌ఫుల్ పీపుల్ వీకెండ్స్ ఎలా గడుపుతారో తెలుసా? .. మీరు ట్రై చేస్తే పక్కా శాటిస్‌ఫై అవుతారు
X

దిశ, ఫీచర్స్ : సక్సెస్ ఫుల్ పీపుల్ ఎప్పుడు చూసినా అంత ఎనర్జిటిక్ గా ఎలా ఉంటారు? ఎన్ని గంటలు వర్క్ చేసినా నెక్స్ట్ డే కూడా అంతే ఉత్సాహం ఎలా వస్తుంది? రిలాక్స్ నుంచి రిలేషన్ షిప్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వరకు.. కొత్తగా నేర్చుకోవడం నుంచి సరికొత్త అనుభవాలను పొందే వరకు.. ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది? వారు చేసేదేంటి.. మనం చేయలేనిది ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇలాంటి సందేహాల్లో విజయవంతమైన వ్యక్తులు తమ వీకెండ్స్ ఎలా గడుపుతారు అనేది కూడా ఉండగా.. అసలు సెలవు దినాల్లో ఎలా ఉంటారు? దీనికి ప్రాధాన్యత ఇస్తారు తెలుసుకుందాం.

వర్కింగ్ ప్రొఫెషనల్స్ తమ కెరీర్ కు అంకితమైపోతున్నారు. కనీసం ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు కూడా సమయం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే పడుకోవడం, తినడం, మళ్లీ పడుకోవడం తప్ప మరో ధ్యాస ఉండదు. కానీ కొందరు మాత్రం ఈ రోజులను ఫుల్ ఆఫ్ మెమోరీస్ గా మార్చుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్ నుంచి సెల్ఫ్ కేర్ వరకు.. ప్రతీ క్షణాన్ని విలువైనదిగా మార్చేసుకుంటారు. ఇంతకీ వీరి వీకెండ్ ప్లాన్స్ ఏముంటాయి? ఎలా ఉంటాయి? ఎలా సద్వినియోగం చేసుకుంటారు? మనం ఏం ఫాలో కావాలి? చూద్దాం.

వీక్ ప్లాన్స్

అప్ కమింగ్ వీక్ లో ఎలాంటి పనులు చేయాలో ముందే ప్లాన్ చేసుకునేందుకు కొంచెం సమయం కేటాయించండి. దీనికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందో నిర్ణయించుకుని.. దానికి అనుగుణంగా ఫాలో అయిపోయిండి. క్యాలెండర్ లో ఏ పని ఎప్పుడు చేయాలో ముందే రాసేసుకోండి. ప్రియారిటీ వైజ్ పనులు చేస్తూ వెళ్లిపోండి.

ఇల్లు ముస్తాబు

చిందరవందరగా ఉండే వాతావరణం చిందరవందరగా ఉన్న మనసుకు దారితీస్తుంది. మనకు తెలియకుండానే చిరాకు, కోపం వచ్చేస్తుంది. కాబట్టి వీక్ పూర్తిగా ఆఫీస్ కు వెళ్లాలని హడావిడిగా పరుగెత్తే మనం వీకెండ్ లో కాస్త ఇంటిపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. శుభ్రమైన, ప్రశాంతమైన అట్మాస్పియర్ క్రియేట్ చేసుకోండి. దీనివల్ల స్ట్రెస్ రిలీజ్ అయిపోయి కాన్సంట్రేషన్ పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు.

నేచర్ కనెక్షన్

ఆఫీసుకు వెళ్ళే సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కుని దుమ్ము, ధూళికి ఎక్స్ పోజ్ అవుతారు. కాలుష్య కారకాలకు గురవుతారు. అందుకే వీకెండ్స్ లో నేచర్ తో కనెక్ట్ అవండి. పచ్చని చెట్లు ఉన్న ప్రదేశాల్లో ఎంజాయ్ చేయండి. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. ఈ టెక్నిక్ ఒత్తిడిని తగ్గించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ప్రకృతిలో గడపడం వల్ల క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి.

పవర్ డౌన్ అండ్ రీఛార్జ్

వీకెండ్ వచ్చిందంటే ముందుగా టెక్నాలజీ నుంచి వీక్ ఆఫ్ తీసుకోండి. లాప్ టాప్, ఫోన్ దూరంగా పెట్టండి. చక్కగా విశ్రాంతి తీసుకోండి. నాణ్యమైన నిద్ర కోసం ఈ పద్ధతి బెస్ట్ అంటున్నారు నిపుణులు. దీనివల్ల నెక్ట్స్ వీక్ ఫోకస్డ్ గా పని చేస్తారని చెప్తున్నాయి స్టడీస్.

బాడీ, మైండ్ కు ఎనర్జీ

వారం మొత్తం ఆఫీస్ టైం అవుతుందని తినకుండానే పరుగెత్తుతాం. మనం చేసే పని పొట్ట నింపుకునేందుకే అయినా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండానే బిజీబిజీగా గడిపేస్తాం. అందుకే కనీసం వీకెండ్ లోనైనా సరిగ్గా తినమని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రాబోయే వారం కోసం ఫుల్ ఎనర్జీతో సిద్ధం కావచ్చు. నచ్చిన ఫుడ్ తో పాటు బాడీని హైడ్రెటెడ్ గా ఉంచుకునేందుకు సరైన మోతాదులో నీరు తీసుకోండి.

ఫ్రెండ్స్ తో కనెక్షన్

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారితో నాణ్యమైన సమయం గడపండి. మన కష్టసుఖాల్లో తోడుండే వారి కోసం విలువైన సమయాన్ని ఇవ్వండి. ఈ కమ్యూనికేషన్ ఒత్తిడి తగ్గించడంలోనూ సహాయపడుతుంది. నాణ్యమైన సంభాషణ మరింత మంచిది.

వర్క్ అవుట్ మస్ట్

శక్తి స్థాయిలను పెంచేందుకు, మానసిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు, అభిజ్ఞా పనితీరు పెరిగేందుకు వ్యాయామం చేయడం చాలా అవసరం. జిమ్ లో కొత్తగా ట్రై చేయండి. రన్నింగ్ అండ్ వాకింగ్ ద్వారా మనసును ఉల్లాసంగా మలుచుకోండి. వ్యాయామం బ్రెయిన్ ను మరింత చురుకుగా చేస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

అభిరుచి, కృతజ్ఞత

మీ అభిరుచికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. పెయింటింగ్, మ్యూజిక్, జర్నలింగ్ వంటివి చేయండి. మీరు వీటిని ఆస్వాదించడం వల్ల సంతోషం, సంతృప్తి పొందుతారు. అంతేకాదు కృతజ్ఞతతో ఉండటం వల్ల సానుకూల దృక్పథం అలవడుతుంది. స్ఫూర్తితో ముందుకు సాగుతారు. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed