పిరుదులపై కొట్టడం వల్ల చిన్న పిల్లల్లో క్రమశిక్షణ..??

by Sujitha Rachapalli |
పిరుదులపై కొట్టడం వల్ల చిన్న పిల్లల్లో క్రమశిక్షణ..??
X

దిశ, ఫీచర్స్ : పిల్లలను కొట్టడం, తిట్టడం లాంటివి చేయడం వల్ల మొండిగా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే పిరుదులపై కొట్టడం మాత్రం లాభదాయకంగా కనిపిస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇలా చేయడం ప్రతికూల ప్రవర్తనలు, దీర్ఘకాలిక ప్రభావాలకు కారణమవుతుందనే విస్తృత నమ్మకాన్ని లేటెస్ట్ స్టడీ సవాలు చేసింది. ధిక్కరణ, ఆందోళన, అభిజ్ఞా సామర్ధ్యాలపై తక్కువ ప్రభావం చూపుతుందని తెలిపారు.

పిల్లలను క్రమశిక్షణలో ఉంచడానికి పిరుదులపై కొట్టడం అత్యంత ప్రభావవంతమైన విధానం. రెండు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలు వార్నింగ్ వంటి తేలికపాటి పద్ధతులకు ప్రతిస్పందించనప్పుడు మాత్రమే దీనిని ఉపయోగించాలి. మృదువైన పద్ధతులు విఫలమైనప్పుడు వారి సహకారాన్ని వేగంగా పొందడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అయితే మొదట ఈ తేలికపాటి పద్ధతులను ప్రయత్నించకుండా.. డైరెక్ట్ పిరుదులపై కొట్టడం సిఫారసు చేయబడలేదు. 8 నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో తక్కువ ప్రభావవంతంగా ఉన్నప్పటికీ.. చిన్న పిల్లలను క్రమశిక్షణతో ఉంచేందుకు మంచిదని సూచిస్తుంది,

Advertisement

Next Story