భర్తలే భార్యల అనారోగ్యానికి కారణం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అధ్యయనం..

by Sujitha Rachapalli |
భర్తలే భార్యల అనారోగ్యానికి కారణం.. షాకింగ్ విషయాలు వెల్లడించిన అధ్యయనం..
X

దిశ, ఫీచర్స్: తల్లి పిల్లల కారణంగా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుందని.. దీనివల్ల మానసికంగా, శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతుందని చెప్తారు నిపుణులు. అయితే తాజా అధ్యయనం పిల్లల కంటే ఎక్కువగా భర్త వల్లనే స్ట్రెస్ కు గురవుతుందని గుర్తించింది. నిజానికి వీళ్లే ఒత్తిడికి మూలంగా ఉంటున్నారని చెప్తుంది. 2013లో 7,000 మందికి పైగా తల్లులపై టుడే నిర్వహించిన ఒక సర్వేలో స్ట్రెస్ లెవల్ 10కి 8.5గా ఉంది. 46% మంది స్త్రీలు పిల్లల కంటే భర్తలు తమకు ఎక్కువ ఒత్తిడిని కలిగించారని చెప్పారు.

ముఖ్యంగా పిల్లల విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, ఇంటి పనుల్లో సహాయం చేయకపోవడంతో కుంగిపోతున్నామని చెప్పారు. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్.. రెండు చోట్ల బాధ్యతలతో హై లెవల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని చెప్పారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒక పనిలో ఉంటామని.. కానీ భర్తలు మాత్రం వీటన్నింటికీ దూరంగా రిలాక్స్ అవుతారని చెప్పారు.

కాగా పడోవా విశ్వవిద్యాలయం అధ్యయనం స్ట్రెస్, ఇంబ్యాలెన్స్ స్త్రీలపై దీర్ఘకాలిక అనారోగ్య ప్రభావాలను కలిగిస్తున్నాయని చెప్తుంది. భర్తలు తమ భార్యలను కోల్పోయినప్పుడు... ఆరోగ్యంలో క్షీణతను అనుభవిస్తారు, అయితే వితంతువులు మాత్రం తరచుగా మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. ఒత్తిడిలో తగ్గుదలను చూస్తారు. కాగా ఈ అధ్యయనం దంపతులు ఒకరిపై మరొకరు ఆధారపడటంలో ఎంత తేడా ఉందో వివరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed