- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Y Chromosome: భూమిపై అంతరించిపోతున్న పురుషులు.. షాకింగ్ డిటైల్స్ రిలీజ్ చేసిన తాజా అధ్యయనం..
దిశ, ఫీచర్స్ : పురుషుల జనాభా అంతరించిపోనుందని షాకింగ్ డిటైల్స్ రిలీజ్ చేసింది తాజా అధ్యయనం. మగవారు తమ Y క్రోమోజోమ్ నెమ్మదిగా కోల్పోతున్నారని... మిలియన్ సంవత్సరాల వరకు పూర్తిగా అదృశ్యం కావచ్చని తెలిపింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఈ విషయాలు గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ క్లిష్టమైన జన్యువు లేకుండా మానవ పునరుత్పత్తి భవిష్యత్తు, మనుగడ ఎలా ఉంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ లో ప్రచురించిన అధ్యయనం.. అమామి స్పీనీ ర్యాట్స్ లో SRY ( సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ ఆన్ Y) లోపం ఉండగా.. సెక్స్ క్రోమోజోమ్‌ల టర్నోవర్ Sox9 పురుష-నిర్దిష్ట నియంత్రణ కారణంగా ఉంది' అని తెలిపింది. అంటే Y క్రోమోజోమ్స్ పూర్తిగా తగ్గిపోగా.. Sox9 రీప్లేస్ చేస్తూ పురుష ఎలుకల ఉత్పత్తికి కారణం అయిందని వివరించింది. కానీ ఎలుకల్లో మాదిరిగా పురుషుల్లో Y క్రోమోజోమ్ ను రీప్లేస్ చేస్తాయా? లేక మగ జనాభా అంతరించిపోతుందా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఇదే జరిగితే లింగ నిర్ధారణకు కొత్త మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది.
Y క్రోమోజోమ్ మానవులలో లింగాన్ని ఎలా నిర్ణయిస్తుంది?
మానవులు, ఇతర క్షీరదాలలో.. ఆడవారు సాధారణంగా రెండు X క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. అయితే మగవారికి ఒక X, చాలా చిన్న Y క్రోమోజోమ్ ఉంటుంది. X క్రోమోజోమ్ తో పోలిస్తే.. దాని పరిమాణం, పరిమిత సంఖ్యలో జన్యువులు సుమారు 55 ఉన్నప్పటికీ- Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తుంది.
SRY (Yలో లింగ-నిర్ధారణ ప్రాంతం)గా పిలువబడే దాని ప్రధాన జన్యువు, పురుషుల అభివృద్ధి ప్రక్రియను ప్రారంభిస్తుంది. గర్భం దాల్చిన 12 వారాల తర్వాత..ఈ జన్యువు పిండంలో వృషణాల ఏర్పాటును ప్రేరేపిస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ వంటి మగ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శిశువు మగపిల్లవాడిగా అభివృద్ధి చెందేలా చూస్తాయి.
ఈ సిస్టమ్ ఎఫెక్టివ్ గా ఉన్నప్పటికీ పర్ఫెక్ట్ కాదు. Y క్రోమోజోమ్, జీన్-రిచ్ X క్రోమోజోమ్‌కు విరుద్ధంగా చాలావరకు నాన్-కోడింగ్ DNAని కలిగి ఉంటుంది. ఇది ఎటువంటి స్పష్టమైన పనితీరును అందించదు. కాలక్రమేణా Y క్రోమోజోమ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. X క్రోమోజోమ్ పెద్దగా మారదు. Y మిలియన్ల సంవత్సరాలలో వందల కొద్దీ జన్యువులను కోల్పోతుంది.