స్కిన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్‌ అందాన్ని పెంచుతాయా?.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు

by Prasanna |   ( Updated:2023-07-18 07:16:30.0  )
స్కిన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్‌ అందాన్ని పెంచుతాయా?.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, ఫీచర్స్ : తాము అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల స్కిన్ గ్లోయింగ్ లేదా స్కిన్ లైటెనింగ్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే ఇటువంటి కొన్నిరకాల ఉత్పత్తులను తరచుగా యూజ్ చేయడంవల్ల డెడ్ స్కిన్‌కు కారణం అవుతాయని, శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు యూఎస్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. చర్మాన్ని కాంతివంతం చేసే ఉత్పత్తుల పనితీరు తెలుసుకునే ఉద్దేశంతో పరిశోధకులు వాటిని యూజ్ చేసే వ్యక్తులను ఏడాదిపాటు అబ్జర్వ్ చేశారు. యూజర్లను సమూహాలుగా విభజించి డెమోగ్రాఫిక్స్, కలరిజం ఆటిట్యూడ్స్, స్కిన్ టోన్ సాటిస్‌ఫెక్షన్, స్కిన్ లైట్నింగ్ హాబిట్స్ వంటి అంశాలను పరిశీలించారు.

238 మంది నల్లజాతీయులు, 83 మంది ఆసియన్లు, 84 మంది బహుళజాతులకు చెందివారు, 31 హిస్పానిక్, 14 నేటివ్ అమెరికన్లు తరచుగావాడే బ్యూటీ ప్రొడక్ట్స్‌వల్ల ఎటువంటి ప్రయోజనం పొందిగలిగారు? అనే విషయాలను పరిశోధకులు స్టడీ చేశారు. అయితే ఎక్కువకాలం వాడినవారు మాత్రం సమస్యలు ఎందుర్కొంటున్నారని, కొందరిలో శాశ్వతంగా ఉంటున్నాయని కనుగొన్నారు. స్కిన్ లైటెనింగ్ ఉత్పత్తుల్లో ఉండే స్టెరాయిడ్లు, పాదరసంతో పాటు కొన్ని కల్తీ పదార్థాలు చర్మాన్ని తాత్కాలికంగా కాంతివంతంగా మార్చుతున్నప్పటికీ, క్రమంగా నష్టాన్ని కలిగిస్తున్నాయని, యూజర్ల చర్మం కాంతిహీనంగా మారడానికి కారణం అవుతున్నాయని గుర్తించారు. మరికొన్ని సౌందర్య సాధనాల్లో హైడ్రోక్వినోన్ అనే బ్లీచింగ్ పదార్థం ఉండటంవల్ల ఇది పర్మినెంట్ హపర్ పిగ్మేంటేషన్ ప్రాబ్లమ్‌కు దారితీస్తుందని కనుగొన్నారు.

Read More: ఎకో ఫ్రెండ్లీ ట్రెడీషనల్ గ్లాస్‌.. కొత్తగా క్రియేట్ చేసిన సైంటిస్టులు

Advertisement

Next Story

Most Viewed