- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Diabetes : డయాబెటిస్ బాధితులా.. మూడుసార్లు కాదు.. ఆరుసార్లు తింటేనే బెటర్ !

దిశ, ఫీచర్స్ : టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్నారా? అయితే మీరు ఆహారం తీసుకునే విధానం కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలుసా? ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా మూడు భాగాలుగా డివైడ్ చేసి ఎక్కువ మొత్తంలో రోజుకూ మూడుసార్లు తినడం కన్నా.. తక్కువ మోతాదులో అంతకు మించి ఎక్కువసార్లు తినడమే మేలు చేస్తుందని, రక్తంలో చక్కెరస్థాయిలు అందుపులో ఉంటాయని నిపుణులు చెబుతన్నారు. 2018లో డయాబెటిస్ అండ్ మెటబాలిజం జర్నల్‌లో పబ్లిషైన అధ్యయనం కూడా ఇదే పేర్కొన్నట్లు వివరిస్తున్నారు.
స్టడీలో భాగంగా పరిశోధకులు ఒబేసిటీతో బాధపడుతున్న 47 మందిని మూడు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఇందులో రెండు గ్రూపులు ప్రీ డయాబెటిస్ బాధితులు కాగా, మరో గ్రూపులో టైప్ 2 డయాబెటిస్ బాధితులు కూడా ఉన్నారు. ఇలా వీరందరిలో బరువు నియంత్రణలో ఉండేలా డైట్ పాటిస్తూనే.. 12 వారాలపాటు కొందరిని మూడు పూటలు, మరికొందరిని ఆరు పూటలు ఆహారం తినాలని సూచించారు. ఆ తర్వాత ఈ పద్ధతిలో మార్పు చేస్తూ మరో 12 వారాలు కంటిన్యూ చేశారు. ఇలా 24 వారాల తర్వాత అందరినీ పరిశీలించగా.. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తిన్నవారిలో మెరుగైన ఫలితాలు ఉన్నట్లు తేలింది. అందరూ ఒకే మోతాదులో కేలరీలు తీసుకున్నప్పటికీ వీరిలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉన్నట్లు వెల్లడైంది.
అదే ప్రీ డయాబెటిస్ రోగుల్లో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి చాలా సమయం తీసుకున్నట్లు బయటపడింది. దీంతోపాటు ఎక్కువ మొత్తంలో మూడుసార్లు తిన్నవారితో పోలిస్తే.. తక్కువ మొత్తంలో ఆరుసార్లు తిన్నవారిలో ఆకలి వేయడం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. మొత్తానికి తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడంవల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ లేనివారు మాత్రం బరువు తగ్గేందుకు ఈ పద్ధతిని ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీ డయాబెటిస్ బాధితులు తక్కువ మొత్తంలో రోజుకు ఆరుసార్లు ఆహారం తీసుకోవడం కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ కూడా తగ్గుతుందని రీసెర్చర్స్ అంటుననారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.