రైతుల కన్నా విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారో తెలుసా?

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-29 07:38:37.0  )
రైతుల కన్నా విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని...'స్టూడెంట్ సూసైడ్స్: యాన్ ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా' పేరుతో రిపోర్ట్ రిలీజ్ అయింది. వార్షిక IC3 కాన్ఫరెన్స్, ఎక్స్‌పో 2024 సందర్భంగా ఈ నివేదిక విడుదల చేయబడగా... ఓవరాల్ పాపులేషన్ గ్రోత్ , టోటల్ సూసైడ్ ట్రెండ్స్ రెండింటినీ మించిపోతున్నాయని తెలిపింది. గత దశాబ్దంలో 0-24 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా.. విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 6,654 నుంచి 13,044 కు పెరిగిందని తెలిపింది.

1. 2021లో 13,089తో పోలిస్తే 2022లో 13,044 మంది విద్యార్థుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.

2. కానీ మొత్తం ఆత్మహత్యలు (విద్యార్థులు మరియు ఇతర వ్యక్తులు) 4.2 శాతం పెరిగాయి, 2021లో 164,033 నుండి 2022లో 170,924కి పెరిగింది.

3. గత 10, 20 సంవత్సరాల్లో మొత్తం ఆత్మహత్యలు సంవత్సరానికి సగటున రెండు శాతం పెరిగితే.. విద్యార్థుల ఆత్మహత్యలు నాలుగు శాతం పెరిగాయి. అంటే మొత్తం ఆత్మహత్యల కంటే రెండు రెట్లు ఎక్కువ.

4. స్టూడెంట్స్ సూసైడ్స్ మొత్తం ఆత్మహత్యలలో 7.6 శాతంగా ఉన్నాయి, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు వంటి అనేక ఇతరులు ఇందులో ఉన్నారు.

5. లింగాల వారీగా చూస్తే మహిళా విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య కంటే పురుష విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 10 ఏళ్లలో అమ్మాయిల ఆత్మహత్యలు 50 శాతం పెరగగా.. అబ్బాయిల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయి. గత ఐదేళ్లలో పురుషులు, మహిళలు ఇద్దరూ సగటున ఏటా 5 శాతం పెరిగారు.

రాష్ట్రాల వారిగా చూస్తే..

  1. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో దేశంలోని మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్యలో మూడింట ఒక వంతు ఉంది.

  2. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్... విద్యార్థుల ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉన్న ఐదు రాష్ట్రాలలో ఒకటిగా ఉంది

  3. తమిళనాడు, జార్ఖండ్ గణనలు విద్యార్థుల ఆత్మహత్యలలో అధిక సంవత్సరపు పెరుగుదలను సూచిస్తున్నాయి. వరుసగా 14 శాతం, 15 శాతంగా ఉన్నాయి.

  4. ఇక రాజస్థాన్.. కోట కోచింగ్ సిటీతో 571 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో పదో స్థానంలో ఉంది.
Advertisement

Next Story

Most Viewed