- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Stroke risk : మూడు దశాబ్దాల్లో 18 శాతం పెరిగిన స్ట్రోక్ ముప్పు.. కారణాలు ఇవేనా?
దిశ,ఫీచర్స్ : జీవనశైలిలో ప్రతికూల మార్పులు, ఆహారపు అలవాట్లు మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలపట్ల నిర్లక్ష్యం పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. గత మూడు దశాబాద్దలతో పోలిస్తే ప్రస్తుతం ఈ ప్రమాదం 18 శాతానికి పెరిగిందని ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’ అధ్యయనం పేర్కొన్నది. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ ప్రాబ్లం కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. మెదడులోని కొంత భాగానికి బ్లడ్ సప్లయ్ నిలిచిపోవడం లేదా అక్కడి రక్తనాళాలు చిట్టిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న స్ట్రోక్‌లలో ప్రధానంగా రెండు రకాలు ఉంటున్నాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ కాగా.. ఇది మెదడులో ధమనులు బ్లాక్ అయినప్పుడు సంభవిస్తుంది. ఇక రెండవది హెమరేజిక్ స్ట్రోక్ కాగా.. బ్రెయిన్‌లో రక్తనాళాల చిట్టిపోవడం వల్ల ఇది వస్తుందని న్యూరాలజిస్టులు పేర్కొంటున్నారు. సరిపడని లేదా చెడు ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి, బీపీ, షుగర్, ఒబేసిటీ, హైపర్ కొలెస్టెరోలేమియా వంటి హెల్త్ ఇష్యూస్ కారణంగా కూడా స్ట్రోక్ లేదా పక్షవాతం ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం.. స్మోక్ చేయడం, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ పెరుగుతోంది. 50 ఏండ్లకంటే తక్కువ ఏజ్ కలిగినవారిలో రోజుకూ 20 సిగరెట్ల వరకు కాల్చడంవల్ల స్ట్రోక్ ముప్పు రెండింతలు పెరుగుతుందని నిపుణులు పరిశోధకులు గుర్తించారు. దీంతోపాటు ధూమపానం, మద్యపానం అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని, హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.