Belly Fat: పొట్టను కరిగించే జపనీస్ వర్కౌట్స్..ఇలా ట్రైయ్ చేయండి..!

by Kanadam.Hamsa lekha |
Belly Fat: పొట్టను కరిగించే జపనీస్ వర్కౌట్స్..ఇలా ట్రైయ్ చేయండి..!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత కాలంలో చాలామందికి పొట్ట బాగా పెరిగిపోయింది.ప్రస్తుత కాలంలో చాలామందికి పొట్ట బాగా పెరిగిపోయింది. జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతుంది. దీని కారణంగా చాలామందికి పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇది శరీరాకృతిని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల సరిగా పనిచేయకపోవడం, మెనోపాజ్, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి పొట్ట భాగంలో కొవ్వు పెరగడానికి కారణం అవుతాయంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అయితే ఈ కొవ్వును కరిగించుకోవాలంటే.. జిమ్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పట్టుకుని సరైన వ్యాయామం చేయడం మంచిది. మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును సాధారణ వ్యాయామం కంటే జపనీస్ చేసే కొన్ని వర్కౌట్స్‌తో ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ఆ వ్యాయమాలు ఏంటో కింద చదివేయండి.

టబాటా వ్యాయమం: సాధారణ వ్యాయమం చేసే టైమ్ కంటే, ఈ టబాటా(Tabata) వర్కౌట్‌ను 4 నిమిషాలు చేస్తే చాలు. ఈ టబాటా అనేది ఒకరకమైన హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT). ఇందులో 20 సెకన్లు వ్యాయామం, 10 సెకన్లు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఎనిమిది సార్లు దీనిని రిపీట్ చేయాలి. లైన్ జంప్, పుష్ అప్స్, స్వ్కాట్స్, స్ప్లిట్ స్వ్కాట్, బర్పీస్ వంటి ఈ టబాటా వ్యాయాల కిందకి వస్తాయి. ఇవి చేయడం ద్వారా పొట్టపై ఒత్తిడి పడి, చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అంతేకాకుండా చేతులు, కాళ్లలపై ఒత్తిడి పడి ఈ భాగాలు స్లిమ్‌గా మారతాయి. ముఖ్యంగా పొట్టభాగంలో ఈ టెక్నిట్ ఉపయోగపడుతుంది.

రేడియో టైసో: జపాన్‌ వారు చేసే ఒక సాధారణ వ్యాయమం.. రేడియో టైసో(Radio taiso). ఇది కోర్ కండరాలకు బాగా పని చేస్తుంది. శరీరాన్ని ముందుకు, వెనక్కి వచుతూ చేస్తే ఈ వర్కౌట్ వల్ల పొట్ట, నడుముపై ఒత్తిడి పడి, చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది. జపాన్‌లోని వృద్ధులు, యువకులు శరీరకంగా దృఢంగా ఉండడానికి ఈ వ్యాయామాన్ని ప్రతిరోజూ చేస్తుంటారు. ఈ వర్కౌట్‌ను గ్రూప్‌గా కానీ, స్నేహితులతో కాని కలిసి చేస్తే, ఆందోళన, పని ఒత్తిడిని తగ్గించి మంచి ఫలితాలు ఇస్తుందని జపాన్ నిపుణులు సూచించారు.

ఐసో‌మెట్రిక్ వ్యాయామం: ఈ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. కదలకుండా ఒకే చోట ఉంటూ కండరాలను వచి చేసే ఈ వ్యాయామాన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్‌ సైజ్(Isometric exercises) అంటారు. ప్లాంక్స్, స్టాటిక్ లెగ్ లిఫ్ట్‌ వర్కౌట్స్‌ జపనీస్ ఫిట్‌నెస్‌ నియమావళిలో కనిపించే సాధారణ ఐసోమెట్రిక్ వ్యాయామాలు. ఇది పొట్ట కండరాలను సాగదీసి, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిచడంలో సహాయపడుతుంది.

కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారు ఫిట్‌నెస్ ట్రైనర్‌ను నియమించుకుని, నెమ్మదిగా వీటిని ప్రారంభించడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed