- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేసవిలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే ఆ అసమస్యలు తప్పవు
దిశ,ఫీచర్స్: మనలో చాలా మంది స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే వేసవిలో స్పైసీ, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా, ఈ ఆహారాల తినడం వల్ల కడుపు నొప్పి, డీహైడ్రేషన్ సమస్యలను కలిగిస్తాయి. వేసవిలో స్పైసీ ఫుడ్ తింటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
వేసవిలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
1. వేసవిలో సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు. అలాంటి సమయంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
2. అల్లం, మిరియాలు తీసుకోవడం వల్ల వేసవిలో కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దాని వలన ఛాతీలో మంట, కడుపు నొప్పి వస్తాయి.
3. మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. కడుపుబ్బరం, వికారం సమస్యలకు దారి తీస్తాయి. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
4. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కొందరిలో మైగ్రేన్, తలనొప్పి సమస్యలు వస్తాయి.
5. వేసవిలో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత అసమతుల్యతలకు దారి తీస్తుంది. ఇది తీవ్రమైన చిరాకు మరియు నిరాశకు కారణమవుతుంది.
6. వేసవిలో స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, జీర్ణవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.