కామంలో కూడా కల్తీ ఉంటుందా..?

by S Gopi |   ( Updated:2022-12-25 10:35:02.0  )
కామంలో కూడా కల్తీ ఉంటుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషిలో సెక్స్ కోరికలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కో వయస్సులో ఒక్కో తీరుగా ఉంటాయి. టీనేజ్ లో చాలా ఎక్కువగా, ఆ తర్వాత అంటే 40లో ఒక మాదిరిగా....60లో మళ్లీ తక్కువగా ఉంటాయి. దీనికి కారణం కేవలం శరీరంలో వచ్చే మార్పులు. జీవ ధర్మం ప్రకారం మనిషి శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందువల్ల మనిషి ఆ మార్పులకు తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేగానీ, ఆ మార్పును ఖండించొద్దు. ఉదాహరణకు 13 ఏళ్ల వయసులో మనిషీ బాడీ అతడిని కామపరంగా రెడీ చేస్తుంది. అదే 40 ఏళ్లు వచ్చేసరికి.. మనిషిని ఎగదోస్తున్న హర్మోన్స్ అన్నీ స్లోగా డౌన్ అవుతాయి. ఆ తర్వాత అవి ఇంకా ఇంకా డౌన్ అవుతుంటాయి. అలా క్రమ క్రమంగా మనిషిలో సెక్స్ కోరికలు స్లోగా తగ్గుతుంటాయి. అదేవిధంగా మనిషి ఫేస్ పాలిపోతుంది.. చర్మం ముడతలు పడుతుంది.. జట్టు రాలుతుంది.. ఒంట్లో సత్తా తగ్గుతుంది. దీన్ని బట్టి చూస్తే మనిషికి పోయే కాలం దగ్గర పడిందని అర్థం. కాకపోతే దీన్ని మనిషి అంగీకరించడు. ఎందుకంటే మనిషి శరీర ధర్మానికి, మరణానికి విరుద్ధంగా బ్రతకాలనుకుంటాడు. అయితే, ఆ విరుద్ధంగా బ్రతకడంలోనే సెక్స్ కోరికలు ఇంకా ఎక్కువవుతాయంటా. అయితే, ఆ కామంలోనే కల్తీ ఉంటుందంటా.

వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో సెక్స్ కోరికలు పెరగడం, అదేవిధంగా ఆ తర్వాత మళ్లీ తగ్గడం జరుగుతుంటాయి. అయితే, బాడీలో అలా వచ్చే మార్పులను యాక్సెప్ట్ చేయాలంటా. అప్పుడు సెక్స్ విషయంలో ఏ ఆందోళన ఉండదంటా. పోయేటప్పుడు ప్రశాంతంగా పోతామంటా. అలా చేస్తే మనిషి మరింత పరిపక్వతత చెందాడని అర్థమంటా. అలాగే మనిషి బాడీ మళ్లీ చిన్న తనానికి వెళ్లిందని అర్థమంటా. ఇలా నిజమైన కామం శరీర మార్పుల పరంగా వస్తుంది... పోతుంది.. అది చాలా హెల్దీ అంటా. కానీ, కల్తీ కామం చచ్చేంతవరకు తిష్ట వేసుకుని కూర్చుంటుందంటా. కల్తీ కామం మనిషిలో ఏం నింపుతుందంటే.. ద్వేషాన్ని, అసూయను, ఈర్శ్యను నింపి మనిషి జీవితాన్ని గజిబిజీ చేసి.. మొత్తంగా జీవితాన్ని నాశనం చేస్తుందంటా.

Read more:

నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Advertisement

Next Story