దోమలకు కళ్లు ఉండవని మీకు తెలుసా...? మరి అవి మనల్ని ఎలా కుడుతాయి??

by S Gopi |   ( Updated:2023-01-17 11:14:19.0  )
దోమలకు కళ్లు ఉండవని మీకు తెలుసా...? మరి అవి మనల్ని ఎలా కుడుతాయి??
X

దిశ, వెబ్ డెస్క్: మనల్ని దోమలు కుట్టినప్పుడు బాధపడుతుంటాం. అబ్బా ఈ దోమలు ఎక్కడికి పోయినా అక్కడికి వస్తున్నాయి అని అనుకుంటాం. అంటే వాటికి కళ్లు ఉంటాయి... అందువల్ల అవి మనం ఎక్కడికి పోయినా అక్కడికి వస్తున్నాయని అనుకుంటారు కొందరు. కానీ, దోమలకు కళ్లు ఉండవన్న విషయం చాలామందికి తెలియదు. కానీ, అవి మనల్ని కుడుతాయి. అదెలాగా అంటే... వాటి చెవులే కళ్లు, రెక్కలే చెవులు! వాటి సాయంతోనే అవి వాటి ఎదురుగా ఉండే జీవులను కనుగొంటాయి. దోమలు తమ రెక్కల సాయంతో శబ్ధ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ శబ్ధ తరంగాలు అలలు అలలుగా ప్రయాణం చేస్తాయి. ప్రయాణ మార్గంలో వాటికి ఏదైనా ప్రాణి అడ్డు వచ్చినప్పుడు అవి తిరిగి వెనక్కు మళ్లి దోమను చేరుతాయి. దీంతో ఆ దోమ తమకు సమీపంలో మనుషులు లేదా ప్రాణమున్న ఏ ఇతర జీవులో ఉన్నట్లు తెలుసుకుని చుట్టూ మూగి, గుయ్యిమన్న శబ్ధంతో తమ ఉనికి చాటుకుని మరీ వాటి ప్రతాపం చూపుతాయి.

ఇవి కూడా చదవండి : మనిషిలోని ఆ గుణమే పెంపుడు జంతువుల మనుగడకు కారణం.. ఓ అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story