విజయానికి మూలాధారాలు.. ‘‘ప్రేరణ అండ్ ఆశయం’’

by Anjali |
విజయానికి మూలాధారాలు.. ‘‘ప్రేరణ అండ్ ఆశయం’’
X

దిశ, ఫీచర్స్: లైఫ్‌లో ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రేరణ -ఆశయం అనేది చాలా ముఖ్యం. ప్రేరణ బలంగా ఉన్నప్పుడే ఆశయం బలంగా ఉంటుంది. కాగా మీరు అనుకున్న లక్ష్యాన్ని అధిగమించాలంటే మీ విజయానికి కారకాలయ్యే మోటివేషన్ అండ్ అంబిషియన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* మీరు అనుకున్న లక్ష్యం సాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఆలోచించుకోండి.

* సక్సెస్ సాధించాక మీ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు దాన్ని సాధించారని భావించండి. ఇలా ఆలోచించుకోవడం వల్ల మీ భావోద్వేగాలను మేల్కొల్పుతుంది. మీలో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది.

* ఎల్లప్పుడూ సానుకూలత పై దృష్టి పెట్టండి.

* ఆచరణీయమైన ప్రణాళికలను రూపొందించండి

* జీవితంలో విజయం సాధించిన వ్యక్తుల గురించి చదవండి. వారి పుస్తకాలు చదివితే మిమ్మల్ని మరింత ప్రేరేపిస్తాయి.

* మీ లక్ష్యానికి సంబంధించిన ఇన్స్పిరేషన్ కోట్స్ చదవండి.

* ఎప్పుడూ కూడా మైండ్‌లోకి చెడు ఆలోచనలను అనుమతించవద్దు.

* మీరు నిరుత్సాహంగా ఉన్నట్లైతే మీ దృష్టి ఆనందించే విషయాలపై మళ్లించండి.

* ముఖ్యంగా సోమరితనాన్ని వదిలిపెట్టండి.

*స్నేహితులు - కుటుంబ సభ్యులు నిరుత్సాహపరిచేలా మాట్లాడిన వారి మాటలను పట్టించుకోకండి.

Advertisement

Next Story

Most Viewed