- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఈ డిగ్రీ నీదే అమ్మ..!' కళ్లు చమర్చే ప్రేమానుబంధం (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః పిల్లల భవిష్యత్తు కోసం కన్నతల్లి చేసే త్యాగాలు ఆ తల్లికి తప్ప మరో వ్యక్తి ఊహకు కూడా అందవంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. తల్లి ప్రేమ అంతటి నిస్వార్థమైంది. తాను ఎలా ఉన్నా పిల్లల్ని చదివించాలని, ఎంతో ఉన్నతంగా చూడాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అలాంటి ఓ తల్లిని కొడుకు సెలబ్రేట్ చేసే విధానం నెట్టింట ఎంతో హృద్యంగా కనిపించింది. ఓ కొడుకు తన గ్రాడ్యుయేషన్ డిగ్రీని తన తల్లికి అంకితం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆంటోనియో చావెక్స్ అనే మెక్సికన్ యువకుడు తన కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక రోజు తన గ్రాడ్యుయేషన్ క్యాప్‌ని తన తల్లి తలపై పెట్టి, ఆమెకు గ్రాడ్యుయేషన్ గౌను కూడా వేస్తాడు. ఆ క్షణం కొడుకును చూసి ఆమె ఆనందంతో, ఇన్నాళ్ల తమ కష్టాన్ని తలుచుకొని కన్నీటిపర్యంతమవుతుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'గుడ్‌న్యూస్_మూవ్‌మెంట్' అనే పేజీ షేర్ చేయగా, మనసుని కదిలించే ఈ క్లిప్‌కి 3.2 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూవ్స్, 205k లైక్‌లు వచ్చాయి.
ఈ పోస్ట్‌లో ఆంటోనియో ఒక సందేశం కూడా ఉంచాడు: "అమ్మ అభినందనలు, ఇదంతా మీరే చేసారు! మేమిద్దరం కలిసి వట్టి చేతులతో జీవితాన్ని ప్రారంభించాం. అబ్బాయిని కాబట్టి నేను మీకు అన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేసాను. అందుకే, నేను ఏది సాధించినా అది మీదే: సైకాలజీ, స్పానిష్‌లో రెండు డిగ్రీలు.. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో మైనర్, నా సాకర్ విజయాలు. దానికి ఇదే రుజువు. మీరు నన్ను, నా సోదరీమణులను, మన కుటుంబాన్ని ఎప్పుడూ విఫలం చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ కొడుకును ప్రేమించు, బడ్డీ" అని రాసాడు.