Solitude : మనిషికి ఏకాంతం ఎందుకు అవసరం?

by Javid Pasha |
Solitude : మనిషికి ఏకాంతం ఎందుకు అవసరం?
X

దిశ, ఫీచర్స్ : ఏకాంతం (ఒంటరిగా గడపడం) కొన్నిసార్లు ఎంత భయంకరమైనదో.. మరికొన్నిసార్లు అంత ఆనంద దాయకమైనది కూడా అంటుంటారు నిపుణులు. కాగా ఇది ఆయా వ్యక్తుల ఆసక్తి, అనుభూతి చెందే తీరును బట్టి కూడా ఉంటుందని చెప్తారు. అయితే జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఏకాంతం ఒక ప్రేరణగా, మధురమైన అనుభూతిగా, ఉత్సాహం నింపే ఆలోచనగా కూడా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో, సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు కాసేపు ఏకాంతంగా గడపాలని భావిస్తుంటారు చాలా మంది. దీనివల్ల సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుస్తుంది.

మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే, గొప్పగా ఎదగాలంటే ఒంటరిగా గడిపేందుకు మీకంటూ (single enlightenment) కొంత సమయం తీసుకోవాలని నిపుణులు అంటుంటారు. వర్కులో బిజీగా ఉన్నప్పుడో, ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చినప్పుడో, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడో అరుదుగానైనా సరే సడెన్‌గా ఒక ఆలోచన వస్తుంది. అదే ‘ఐ నీడ్ రెస్ట్’ లేదా ‘ఐ నీడ్ స్పేస్. ఎందుకంటే.. ఆ సందర్భంలో కొంత సమయాన్ని కేటాయించుకోవడం, ఏకాంతంగా గడపడం అనేది మానసిక అలసటను దూరం చేస్తుంది. ఆ విలువైన క్షణంలో మనిషి తనతో తను మాట్లాడుకుంటాడు. తన గురించి తాను తెలుసుకుంటాడు. తన లోపాలను అధిగమించే ఆలోచనల్లో విహరిస్తుంటాడు. ఆనందాన్ని ఆస్వాదించే మార్గాలను వెతుక్కుంటాడు.

అనేక రకాల ఆలోచనల సంఘర్షణలకు అవకాశమిచ్చి, అవసరమైన వాటిని సెలెక్ట్ చేసుకుని ఆచరణలో పెట్టడానికి హెల్ప్ చేయగల గొప్ప మార్గం ఏకాంతమే. ‘ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తుంటారు’ అనే వ్యక్తులు జీవితంలో సక్సెస్ సాధించిన రుజువులు అనేకం ఉన్నాయి. అందుకు చక్కటి ఉదాహరణ గౌతమ బుద్ధుడు. ఏకాంత ప్రదేశంలోనే అతనికి జ్ఞానోదయం అయింది. అది ప్రపంచానికి మార్గదర్శకం అయింది. మీ ఆలోచనలు, ఏకాంత క్షణాలు ఈ సమాజానికి రోల్ మోడల్ అవుతాయో లేదో కానీ, మీ ఎదుగుదలకు మాత్రం కచ్చితంగా తోడ్పడతాయి. అందుకే ప్రతికూల పరిస్థితులు వెంటాడుతున్నప్పుడు, సమస్యలు సుడిగుండాలు దాటాల్సి వచ్చిప్పుడు మీ కుటుంబం, ఈ సమాజం కూడా సాలో చేయలేని పరిస్థితి ఎదురైతే గనుక, మీరు ఏకాంతాన్ని ఆశ్రయించండి. అప్పుడు చక్కటి పరిష్కార మార్గం మీ హృదయాంతరాల్లోంచి పుట్టుకొస్తుంది అంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed