సివిల్ సప్లై గోడౌన్ లో మూలుగుతున్న పట్టుకున్న బియ్యం

by Kalyani |
సివిల్ సప్లై గోడౌన్ లో మూలుగుతున్న పట్టుకున్న బియ్యం
X

దిశ,ఏన్కూర్ : పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుంటే పట్టుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారులు వాటిని గోడౌన్ భద్రపరిచారు. ఏనుకూరు మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ లోకి గతంలో ఏనుకూరు, కారేపల్లి, కామేపల్లి, తదితర ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్న బియ్యాన్ని సమాచారం మేరకు పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు ఈగోడౌన్ లోకి తరలించి నిల్వ ఉంచడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ఈగోడౌన్ లో సుమారు మూడు నాలుగు వందల క్వింటాల బియ్యం నిల్వ ఉంచడం వల్ల ప్రస్తుతం ఈ బియ్యం పురుగులు పట్టి ఉన్నాయి. సుమారు వీటి విలువ లక్షల రూపాయలు ఉన్నప్పటికీ వాటి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు అందాల్సిన బియ్యం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్న చోద్యం చూస్తున్న సివిల్ సప్లై అధికారులు. పట్టుకున్న బియ్యాన్ని వేలంపాట వేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అలాంటి చర్యలు ఏమి తీసుకున్నట్లు కనబడట్లేదని ప్రజల నుంచి వినిపిస్తున్న బహిరంగ విమర్శలు.

ఇంతకాలం నుంచి బియ్యం పురుగులు బట్టి ముక్క వాసన వస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పట్టుకున్న బియ్యం ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ నిల్వ ఉన్న సంగతి జిల్లా సివిల్ సప్లై అధికారులు తెలుసో తెలియదో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ బియ్యానికి ఇటీవల కాలంలో వేలంపాట నిర్వహించారు అన్న విషయం తెలిసింది. వేలంపాటలో పాల్గొన్న వ్యక్తి డబ్బులు కట్టి బియ్యం తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతవరకు ఆ బియ్యం తీసుకెళ్లలేదంటే వేలం పాట పాడిన వ్యక్తికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటే బియ్యం తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికైనా జిల్లా సివిల్ సప్లై అధికారులు కళ్ళు తెరిచి పట్టుకున్న బియ్యాని వేలంపాట నిర్వహించటమా, లేదా? ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూడాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై ను వివరణ కోరగా నేను ఇటీవల కాలంలోనే బాధ్యతలు చేపట్టానాని పూర్తి వివరాలు తనకు తెలియదన్నారు.

Advertisement
Next Story