- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వల్లభనేని వంశీకి మరోసారి షాక్.. రిమాండ్ పొడిగింపు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే (Former YSRCP MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి మరోసారి షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP government rule) గన్నవరం తెలుగుదేశం పార్టీ (TDP) కార్యాలయంపై జరిగిన దాడిలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా అతనికి బెయిల్ వస్తుందని అంతా భావించారు. కానీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (Vijayawada SC , ST Court) మరోసారి రిమాండ్‌ను పొడిగించింది. దీంతో ఆయన ఏప్రిల్ 8 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ తో పాటుగా మరో నలుగురికి రిమాండ్ పొడిగించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంలో వంశీ, అతని అనుచరులు విధ్వంసం సృష్టించి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని, సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తర్వాత సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆరోపణలతో వంశీపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో BNS సెక్షన్ 140(1), 308, 351(3), మరియు SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో 2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. నాటి నుంచి నేటి వరకు.. దాదాపు నెల రోజుల నుంచి వంశీ విజయవాడ జైలులోనే ఉన్నారు.