- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. 20 రోజుల వ్యవధిలోనే ఐదుగురిపై దాడి..
రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. 20 రోజుల వ్యవధిలోనే ఐదుగురిపై దాడి..
by Aamani |

X
దిశ,భూదాన్ పోచంపల్లి : వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఓ మహిళ గాయాల పాలయింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని గాంధీనగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. మహిళకు తీవ్రంగా రక్తస్రావం జరగడం తో చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. 20 రోజుల క్రితం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో నలుగురు వ్యక్తులపై దాడి చేశాయి. అది మరచి 20 రోజులు గడవక ముందే మరో ఓ మహిళపై దాడి జరిగింది. వీధి కుక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.
Next Story