ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

by Aamani |
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ,కామారెడ్డి : ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ క్రింద చేపడుతున్న కార్యక్రమాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... లే అవుట్ల క్రమబద్ధీకరణ ఈ నెల 31 తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed