SKIN CANCER : చర్మ క్యాన్సర్ రోగులకు శుభవార్త.. ఈ సబ్బుతో వ్యాధి నివారణ

by Sujitha Rachapalli |
SKIN CANCER : చర్మ క్యాన్సర్ రోగులకు శుభవార్త.. ఈ సబ్బుతో వ్యాధి నివారణ
X

దిశ, ఫీచర్స్ : యూఎస్ వర్జీనియాకు చెందిన 15ఏళ్ల బాలుడు హేమెన్ బెకలేను టైమ్ మ్యాగజైన్, టైమ్ ఫర్ కిడ్స్... 2024 కిడ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించాయి. చర్మ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన సామర్థ్యంతో కూడిన సబ్బు కనిపెట్టి సెన్సేషన్ గా మారడమే ఇందుకు కారణం. కాగా ఈ సోప్ ను మెలనోమాతో సహా చర్మ క్యాన్సర్లకు చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చే సులభమైన పద్ధతిగా వర్ణించిన మ్యాగజైన్... ఇది మార్కెట్ లోకి వచ్చేందుకు మరిన్ని సంవత్సరాలు పట్టొచ్చు కానీ వాస్తవంగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నారని నివేదించింది. USA టుడే నివేదిక ప్రకారం 3M, డిస్కవరీ ఎడ్యుకేషన్ బెకెల్ ను అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్ గా గుర్తించాయి. రూ. 2,065,000 నగదు బహుమతిని అందించాయి.

అడిస్ అబాబాలో జన్మించిన బెకేలే నాలుగేళ్ల వయసులోనే తన కుటుంబంతో అమెరికాకు షిఫ్ట్ అయ్యాడు. ఇథియోపియాలో తన చిన్నతనంలో ప్రజలు సూర్యరశ్మికి ఎక్కువగా గురయ్యేవారని.. వారి పరిస్థితులే ఈ సోప్ డెవలప్ చేసేందుకు కారణమయ్యాయని తెలిపాడు. బాలుడు ప్రస్తుతం జాన్స్ హాప్ కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో మాలిక్యులర్ బయాలజిస్ట్ వీటో రెబెక్కాతో వర్క్ చేస్తున్నాడు. కాగా ఈ సోప్ పై పేటెంట్ రైట్స్, FDA ఆమోదం పొందడం వంటి సవాళ్లు ఎదుర్కొన్నా.. హేమాన్ ఆశాజనకంగా ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed