నటనలో నెంబర్ వన్: చనిపోయినట్లుగా నటిస్తున్న పాములు.. దగ్గరికి వెళ్తే అంతే?

by Jakkula Samataha |
నటనలో నెంబర్ వన్: చనిపోయినట్లుగా నటిస్తున్న పాములు.. దగ్గరికి వెళ్తే అంతే?
X

దిశ, ఫీచర్స్ : పాములంటే చాలా భయం ఉంటుంది. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో, వేసవి కాలంలో బయటకు వస్తుంటాయి. కొన్ని పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా త్రాచు పాములను చూస్తే ప్రతి ఒక్కరూ వణికిపోతుంటారు. ఎందుకంటే ? అవి చాలా స్పీడ్‌గా వెళ్లడం, మనుషులపైకి కూడా బుసలు కొడుతూ వస్తుంటాయి.

అయితే పాములనేవి ఎక్కువగా, అడవులు, గుట్టలు , చెత్త చెదారం ఉన్న ప్లేసెస్‌లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కువగా చెట్లను నరకడం, గుట్టలను కూడా గ్రానైట్ పేరుతో వాటిని లేకుండా చేయడంతో పాములు ఇండ్లలోకి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇంటిలోకి వచ్చిన పాములను చంపడం సహజం. ఎందుకంటే అవి విషపూరితమైనవి, చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఒక వేళ అది కుడితే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి, వాటిని చంపుతారు. అయితే ఈ మధ్యకాలంలో పాములు నటనలో ఆరితేరుతున్నాయంట. మరీ ముఖ్యంగా నాట్రిక్స్ టెస్సెల్లాట అనే పాము, ఎదుటి వారిని బురిడి కొట్టించడంలో నెంబర్ వన్ అంట. ఏదైనా ప్రాణి లేదా పాము తన వద్దకు వస్తే చనిపోయినట్లు నటించి కాట్ వేస్తుందంట. వీటిని పాచికపాములు అంటారని, ఇవి ఎక్కువగా యూరప్, ఆసియాలో కనిపిస్తాయంట. అలాగే మన ఇండ్లలోకి వచ్చే కొన్ని పాములు కూడా కొట్టగానే చనిపోయినట్లు నటించి, తర్వాత దగ్గరికి వెళ్లగానే కాటు వేస్తున్నాయి. ఇలా పాము కాటుకు బలై చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి

Advertisement

Next Story

Most Viewed