ఆడ పాములలో లైంగిక ప్రేరణ కలిగించే స్త్రీ జననేంద్రియ అవయవం.. గుర్తించిన పరిశోధనలు

by Hajipasha |   ( Updated:2022-12-14 14:05:49.0  )
ఆడ పాములలో లైంగిక ప్రేరణ కలిగించే స్త్రీ జననేంద్రియ అవయవం.. గుర్తించిన పరిశోధనలు
X

దిశ, ఫీచర్స్: సెక్స్ అవయవాలపై వివరణాత్మక పరిశోధన నిర్వహించిన శాస్త్రవేత్తలు ఆడ పాములకు క్లిటోరైసెస్(లైంగిక ప్రేరణ, ప్లెజర్‌లో ప్రధానపాత్ర పోషించే స్త్రీ జననేంద్రియ అవయవం) ఉందని నిర్ధారించారు. ఆడ పాములకు సువాసన గ్రంథులు ఉన్నాయని, పురుషాంగం అభివృద్ధి చెందని సంస్కరణలు ఉన్నాయని మునుపటి పరిశోధన ఊహించింది. కానీ కొత్త అధ్యయనం 'క్లిటోరైసెస్' గురించి పూర్తి వివరణను అందించడం ద్వారా ఆ సిద్ధాంతాలను తోసిపుచ్చింది.

ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ B పత్రికలో ప్రచురించబడిన అధ్యయనంలో ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చారు పరిశోధకులు. సకశేరుక వంశాలలో లైంగిక పునరుత్పత్తిపై మన అవగాహనను పరిమితం చేస్తూ.. వారి పురుష ప్రత్యర్థులతో పోల్చితే స్త్రీ జననేంద్రియాలు ప్రస్ఫుటంగా విస్మరించబడతాయి. పరిశోధన మొదట హెమిక్లిటోరిస్‌ను విశ్లేషించడం ద్వారా ప్రారంభమైందని తెలిపారు. 'హెమిక్లిటోరిస్' అనే పదం మొదట 1995లో జర్మన్ హెర్పెటాలజిస్ట్ వోల్ఫ్‌గ్యాంగ్ బోహ్మ్.. మొదటి స్త్రీ లైంగిక అవయవాలను వివరించినప్పుడు ఉద్భవించింది. 1800ల వరకు సరీసృపాలలో 'హెమిపెనిస్' అనే ద్వంద్వ లైంగిక అవయవాలు ఉన్నాయని తెలిసింది.

ఈ బృందం కొండచిలువ, మెక్సికన్ మొకాసిన్‌తో సహా తొమ్మిది వేర్వేరు జాతుల నుంచి 10 పాములను ఎంచుకుంది. వీటిలో ఒక పాము రెండు ఇండివిడ్యువల్ క్లిటోరైస్‌లతో ఉన్నట్లు గుర్తించారు. హెమిక్లిటోరిస్ కణజాలం, దాని తోక కింద దాచిన చర్మంతో వేరు చేయబడినట్లు కనుగొన్నారు. కొన్ని చాలా సన్నగా.. ఒక మిల్లీమీటర్ కంటే తక్కువ నుంచి ఏడు మిల్లీమీటర్ల వరకు ఉంటాయని తెలిపారు.

కాగా పరిశోధనలకు ఇంత సమయం పట్టేందుకు కారణం.. 'ఇది చాలా నిషిద్ధమైన విషయం. స్త్రీ జననేంద్రియాల అంశం అంత ఈజీ సబ్జెక్ట్ కాదు' అని చెప్పారు శాస్త్రవేత్తలు. పాములు, సరీసృపాలలో క్లిటోరైస్‌లు సాధారణం కావచ్చని, పునరుత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కొత్త అధ్యయనం సూచిస్తోంది. మానవులతో సహా క్షీరదాలపై ఈ విషయంలో చాలా తక్కువ పరిశోధనలు జరిగాయన్న వారు.. మానవ క్లిటోరిస్‌లో 1,100 నుంచి 9,850 నరాల ఫైబర్‌లు ఉన్నాయని, అంటే ఇంతకు ముందు ఉదహరించిన దానికంటే 20 శాతం ఎక్కువ అని సరికొత్త అధ్యయనం చెప్తోంది.

READ MORE

ఆడ పాములలో లైంగిక ప్రేరణ కలిగించే స్త్రీ జననేంద్రియ అవయవం.. గుర్తించిన పరిశోధనలు

Advertisement

Next Story

Most Viewed