- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smiling depression: స్మైలింగ్ డిప్రెషన్.. మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వుతుంటారు!
దిశ, ఫీచర్స్: మెరిసేదంతా బంగారం కాదు.. అలాగే మొఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు కనిపించినంత మాత్రాన వారు అందరికంటే సంతోషంగా ఉంటున్నారని కూడా కాదు. అందుకే అంటారు పెద్దలు. నవ్వు వెనుక బాధను అర్థం చేసుకోగలిగినవారే విజ్ఞులని. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక వ్యక్తిలోని నవ్వును తప్పుగా అర్థం చేసుకోవడం, తప్పుగా అంచనా వేయడం ఇటీవల పెరిగిపోతోందని నిపుణులు చెప్తున్నారు.
సమస్యకు కారణం?
నిజానికి నవ్వు సంతోషానికి ప్రతిబింబం. కాబట్టి.. స్మైల్ ఇచ్చే ప్రతీ వ్యక్తి ఆనందంగా ఉన్నారని ఇతరులు అనుకోవడాన్ని మనం తప్పుపట్టలేం. కానీ కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవడం కూడా అవసరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇటీవల యువతలో, పెద్దల్లో స్మైలింగ్ డిప్రెషన్ పెరిగిపోతోందని చెప్తున్నారు. అంటే మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తుంటారు. ఇలాంటి వారినే స్మైలింగ్ డిప్రెషన్ బాధితులుగా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. వర్క్ అండ్ మెంటల్ స్ట్రెస్, అనారోగ్యాలు, కుటుంబ, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, వేధింపులు ఇలా రకరకాల సమస్యలు స్మైలింగ్ డిప్రెషన్‌కు దారితీస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎలా గుర్తించాలి?
ముఖంపై చిరునవ్వు కనిపిస్తే సంతోషంగా ఉన్నారనే అనుకుంటాం కదా.. అలాంటప్పుడు స్మైలింగ్ డిప్రెషన్‌ను ఎలా గుర్తించాలన్న సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. అయితే దీనికోసం స్పెషల్‌గా ఎలాంటి టెస్టులు ఉండవని నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తి బిహేవియర్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. చాలా మంది పరిశీలనగా చూడరు కాబట్టి నవ్వినప్పుడు సంతోషంగా ఉన్నారనే అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తే ఫేక్ స్మైలింగ్‌కు, నేచురల్ స్మైలింగ్‌కు తేడా కనిపిస్తుంది.
కచ్చితంగా చెప్పగలమా?
నిజంగానే సంతోషంగా నవ్వే వ్యక్తి ఆ సందర్భాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారు. గుండెలోతుల్లోంచి ఫీల్ అయ్యి నవ్వుతారు కాబట్టి కళ్లల్లో అది కనిపిస్తుందని, హావ భావాలు కూడా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా, నిజమైన ఆనందంతో నవ్వే నవ్వుకు సంబంధించిన లక్షణాలు ఇవే అని కచ్చితంగా నిర్వచించలేం కానీ.. ఆ క్షణంలో చూసేవారిని కాస్త పరిశీలనగా గమనిస్తే మాత్రం చూసేవారికి అర్థం అవుతుందని నిపుణులు అంటున్నారు.
తప్పించుకునే ప్రయత్నం
ఇక మనసులో బాధగా ఉన్నవారు పైకి నవ్వుతున్నప్పటికీ ఏదో క్షణంలో వారి కళ్లల్లో అది కనిపిస్తుంది. సూటిగా చూడకపోవడం, సంతోషకరమైన సందర్భం నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేయడం వంటి లక్షణాలు కూడా స్మైలింగ్ డిప్రెషన్ బాధితుల్లో ఉండవచ్చు. ఒకవేళ వీటిని బయటకు ప్రదర్శింకపోయినా వారి ముఖ కవళికల్లో, ప్రవర్తనలో వారు అనీజీగా ఫీలవడాన్ని బట్టి స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నారని గుర్తించవచ్చు.
మరికొన్ని లక్షణాలు
స్మైలింగ్ డిప్రెషన్‌తో బాధపడేవారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఎప్పుడూ అలసిపోయినట్లు, ఏ విషయం పట్ల కూడా ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కువగా నిరాశ చెందుతుంటారు. సంతోషకరమైన సందర్భాల్లో పైకి నవ్వుతున్నప్పటికీ వీలైనంత వరకు అవైడ్ చేసే ఉద్దేశంతో ఉంటారు.
పరిష్కారం ఏమిటి?
స్మైలింగ్ డిప్రెషన్‌కు దీర్ఘకాలిక అనారోగ్యాలు, పని ఒత్తిడి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వేధింపులు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అయితే ఇది ఎల్లప్పుడూ ఉండే సమస్య కూడా కాదంటున్నారు నిపుణులు. కొంత కాలానికి లేదా కొద్ది రోజులకు పరిస్థితులు చక్కబడటంవల్లనో, బాధితులు రియలైజ్ అవడం కారణంగానో సహజంగానే సమస్య నుంచి బయటపడతారు. అలా జరగనప్పుడు మాత్రం మానసిక నిపుణులను సంప్రదిస్తే సమస్య మూలాలను బట్టి పరిష్కారాన్ని సూచిస్తారు. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా, ఒత్తిడిని తగ్గించే మెడికేషన్స్ ద్వారా, కౌన్సెలింగ్ ద్వారా స్మైలింగ్ డిప్రెషన్ సమస్యకు ట్రీట్మెంట్ అందిస్తారు.