Smart Zombies : వామ్మో ‘స్మార్ట్ జాంబీ’లు..! పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త !

by Javid Pasha |   ( Updated:2024-11-08 06:32:54.0  )
Smart Zombies : వామ్మో ‘స్మార్ట్ జాంబీ’లు..! పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త !
X

దిశ, ఫీచర్స్ : ఆకలేసినప్పుడు తినడానికి స్నాక్స్ ఇవ్వాలని లేదా అన్నం పెట్టాలని అడగడం సహజం. కానీ ఇప్పటి పిల్లల్లో చాలా మంది మరో మాట కూడా అడుగుతున్నారు. ఏంటంటే.. ‘పోన్ ఇస్తేనే తింటాం’ అంటూ మొండికేస్తున్నారు. ఆ తర్వాతనే ముద్ద నోట్లో పెడుతున్నారు. ఇక ఆ సమయంలో వారిలో కనిపించే లరో లక్షణం.. పూర్తిగా నిమగ్నమై పోవడం, అలా ఫోన్ చూస్తూనే తినేస్తుంటారు. చివరికి తాము ఏం తింటున్నానమో, ఎంత తింటున్నామో అనే స్పృహ కూడా ఉండదు. దీనినే పిల్లలు ‘స్మార్ట్ జాంబీ’లుగా మారే పరిస్థితిగా మానసిక నిపుణులు వర్ణిస్తున్నారు. దీని నుంచి బయటపడకపోతే మాత్రం పిల్లల్లో ఎదుగుదల మందగిస్తుందని జపాన్‌లో ఫస్ట్ గ్రేడ్ పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి పేరెంట్స్ తగిన కేర్ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టెక్నాలజీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వారిలో కనిపించే ‘స్మార్ట్ జాంబీ’ (Smart Zombies) లక్షణాలే చక్కటి ఉదాహరణగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇదొక తీవ్రమైన వ్యసనంగా, రుగ్మతగా మారి పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలను (Mental growth) అడ్డుకుంటోందని చెప్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లకు అతుక్కుపోతున్న పిల్లలు ప్రకృతిలో గడపడం, ఫిజికల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వంటి పరిస్థితులకు దూరం అవుతున్నారని, తదేకంగా ఫోన్ చూస్తూ ఇంటిలోనే గడిపే పిల్లల సంఖ్య పెరిగిపోతోందని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పిల్లల్లో క్రియేటివిటీ, ఏకాగ్రత్త, స్థిత ప్రజ్ఞత వంటి ముఖ్యమైన నైపుణ్యాలు లోపిస్తున్నాయని చెప్తున్నారు.

ఇక టీనేజీ పిల్లల్లో ఫోన్ అతిగా వాడటంవల్ల తలెత్తే ‘స్మార్ట్ జాంబీ’ మానసిక దశవల్ల వారిలో నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా మెదడు పనితీరు మందగిస్తోందని, జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే స్మార్ట్ ఫోన్‌లో పూర్తిగా నిమగ్నమయ్యే పిల్లలు ఎక్కువగా కుంగుబాటుకు గురవుతున్నారని, మానసి రుగ్మతల బారిన పడుతున్నారని నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. సాధ్యమైనంత వరకు పిల్లలను స్మార్ట్ ఫోన్‌లకు అడిక్ట్ (Addicted to smart phones) కాకుండా పేరెంట్స్ నివారించడమే ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed