- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందమైన పచ్చలహారం.. చూడగానే పడిపోతున్న అమ్మాయిలు.. ట్రెండ్ సెట్టర్ ఎవరో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఇటీవల ఏ వేడుకలో చూసినా పెళ్లి కూతురు సహా, పెళ్లికి వచ్చిన వారిలో చాలామంది మహిళలు ఆకుపచ్చ వజ్రాలు లేదా ముత్యాలు పొదిగిన అందమైన పచ్చలహరాలతో కనిపిస్తున్నారని ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రెహానా మాలిక్ అంటున్నారు. అంతేకాదు ఈ మధ్య అన్ని జ్యువెల్లరీ షాపుల్లోనూ ఈ ఆభరణాలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అమ్మాయిలు, వధువులు ఎక్కువగా వీటిని కొనడానికి, ధరించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఎమెరాల్డ్స్ (emeralds) ఇప్పుడు సరికొత్త బ్రైడల్ జ్యువెల్లరీగా ట్రిండింగ్‌లో ఉన్నాయి. అయితే ఈ ఆకుపచ్చటి నెక్లెస్ లేదా పచ్చలహారాలు అత్యంత పాపులర్ అవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అదేంటో చూద్దాం.
ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంత ఘనంగా జరిగాయో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. పెళ్లిలో రకరకాల వంటకాలు, రుచులు, కార్యక్రమాలు అతిథులను మెస్మరైజ్ చేశాయి. మూడు రోజులపాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిజానికి ఒక వరల్డ్ వైడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌ను తలపించాయనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ వేడుకలో ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మహిళా సెలబ్రిటీలతోపాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారస్తుల దృష్టిని ఆకర్షించారు. ఇందుకు కారణం ఆమె తన మెడలో ధరించిన నెక్లెస్.
అనంత్ అంబానీ ధరించిన భారీ ఎంబ్రాల్డ్ (నెక్లెస్) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్యువెల్లరీ ఔత్సాహికులను బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే అరచేతి మందంలో ఉండే ఈ బంగారు ఆభరణంలో తళ తళ మెరిసే ఆకుపచ్చటి వజ్రాలు పొదిగి ఉన్నాయి. సాధారణ డిజైనర్ జ్యువెల్లరీస్‌కి చాలా భిన్నంగా కనిపిస్తూ అందరినీ ఆకర్షించింది ఆ సరికొత్త నెక్లెస్. అంతేకాదు మూడు రోజులపాటు జరిగిన వేడుకల్లో దీపికా పదుకొనే, ఇవాంకా ట్రంప్, సోనమ్ కపూర్, షారుక్ ఖాన్ వంటి ఫేమస్ సెలబ్రిటీలు కూడా వివాహానికి ముందు జరిగిన ఆనందోత్సవాల్లో వాటినే ధరించి తళుక్కు మన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆనందోత్సవాలను ఎంబ్రాల్డ్ ఫెస్ట్‌గా మార్చారు. అప్పటి నుంచి ఈ ఆకుపచ్చ హారం వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం బ్రైడల్ జ్యువెల్లరీగా పాపులర్ అయిపోయిన ఈ ఎంబ్రాల్డ్ ట్రెండ్ సెట్టర్ ఎవరో కాదు.. నీతా అంబానీ.