Skin care mistakes: మీ ఫేస్‌కు ఎట్టిపరిస్థితిల్లోనూ రాయకూడని 5 పదార్థాలివే..!

by Anjali |
Skin care mistakes: మీ ఫేస్‌కు ఎట్టిపరిస్థితిల్లోనూ రాయకూడని 5 పదార్థాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: చర్మం అందంగా మెరవడం కోసం చాలా మంది పలు రకాల చిట్కాలు ఫాలో అవుతారు. కొన్ని టిప్స్ బాగానే పనిచేసినప్పటికీ పలు చిట్కాలు మాత్రం ఫేస్ ను డ్యామేజ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. కామన్ గా చాలా మంది ముఖానికి దోస కాయలు, నిమ్మకాయలను, టమాలను ఉపయోగించి ఫేస్ పై ఏదోటి అప్లై చేస్తుంటారు. కానీ వీటి వల్ల స్కిన్ కు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చెప్పే అన్ని రకాల హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం సరైంది కాదు. ముఖ్యంగా ఈ ఐదు రెమెడీస్ కు దూరంగా ఉండండి. లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే?

షుగర్..

షుగర్ వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఫేస్ పై స్క్రబ్ చేస్తే మాత్రం నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఫేస్ పై రాస్తే గరుకుగా ఉండే స్కిన్ కణాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. దీంతో స్కిన్ మరింతగా సున్నితంగా మారుతుంది. కాగా ఫేస్ షైనింగ్ కోసం షుగర్ వాడకపోవడం మంచిది.

టమాటా..

టమాటా జ్యూస్ చాలా మంది ఫేస్ పై రాస్తుంటారు. దీంతో స్కిన్ ప్రకాశవంతంగా మెరిసిపోతుందని అని పలువురి భావన. అవును ఇది వాస్తవమే. టమాటాలో ఉండే బ్లీచింగ్ స్కిన్ ను క్లీన్ చేసి తాజా లుక్ ను ఇస్తుంది. కానీ టమాటాను డైరెక్ట్ ముఖంపై రాయడం వల్ల దీనిలో ఉండే యాసిడ్ మీ స్కిన్ సహజ పీహెచ్ లెవల్ ను పాడు చేస్తుంది. దీంతో చర్మంపై చికాకుగా అనిపించడం, పొడిబారడం లాంటివి కనిపిస్తాయి.

బేకింగ్ సోడా..

ఫేస్ పై మచ్చలను వదిలించుకునేందుకు బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. చాలా మంది బేకింగ్ సోడాను స్క్రబ‌్‌గా యూజ్ చేస్తారు. కానీ స్కిన్ ఆయిల్ ను కోల్పోతుంది. ఫేస్ లో సున్నితత్వం ఏర్పడుతుంది. దీంతో స్కిన్ పొడిబారి నిర్జీవంగా అవుతుంది.

నిమ్మరసం..

నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలం వస్తే చాలు ఎక్కువ మంది నిమ్మరసం తాగడానికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే నిమ్మకాయ రసాన్ని ఫేస్ పై కూడా రాస్తారు. కానీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. చర్మం పీహెచ్ స్థాయి దెబ్బతింటుంది. యూవీ కిరణాలను మరింత సున్నితంగా అవుతుంది. ఫేస్ రెడ్ కలర్ లోకి కూడా మారే అవకాశం ఉంటుంది.

టూత్ పేస్ట్..

చాలా మంది ఆడవాళ్లు పడుకునే ముందు ఫేస్ పై పింపుల్స్ ఉంటే టూత్ పేస్ట్ అప్లై చేస్తారు. కానీ ఇది స్కిన్ కు అంత మంచిది కాదు. ఈ పేస్ట్ లో ఉండే రసాయనాలు చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. చర్మంలో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. పింపుల్స్ తగ్గడమే కాకుండా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed